శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ నుంచి రూ 6 లక్షలు మాయం అయ్యాయి. నకిలీ చెక్కులు వాడి ఆ సొమ్మును విత్డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్లోనింగ్ చేసిన చెక్కులతో మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నకిలీ చెక్కులతో ట్రస్టు అకౌంట్ నుంచి రూ 6 లక్షలు డ్రా చేసినట్లు ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్య డీఎస్పీ రాజేశ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐపీసీలోని 471, 468, 467, 420, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
నయాఘాట్ ప్రాంతంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచీ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయ్యాయి. ఆ చెక్కులపై సంపత్ రాయ్తో పాటు అనిల్ మిశ్రా సంతకాలు ఉన్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీన రూ 2.25 లక్షలు డ్రా చేశారు. ఆ సొమ్మును పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉన్న మరో అకౌంట్లో డిపాజిట్ చేసినట్లు ఫిర్యాదు చేశారు.
సెప్టెంబర్ 8వ తేదీన కూడా రూ 3.50 లక్షల చెక్కును మళ్లీ పీఎన్బీ బ్యాంకుకు బదిలీ చేశారు. ట్రస్టు చెక్కు బుక్లో పేర్లతో స్లిప్స్ ఉన్నా.. లావాదేవీ జరగడం పట్ల ట్రస్టు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
ఈషా ఫౌండేషన్పై పోలీసుల చర్యలకు `సుప్రీం’ బ్రేక్
జార్ఖండ్లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతుంది
రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్