దేశ ప్రజలు కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రారంభంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీమాట్లాడుతూ తాను ప్రజల నుంచి కోరుకుంటున్నది ఏంటంటే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు.
ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండి, తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలందరూ వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు తమకు తాము రక్షించుకునేందుకు సామాజిక దూరం పాటించడమే ఉత్తమమని మోదీ హితవు చెప్పారు.
మత్య్సకారుల కోసం పీఎం మత్స్య సంపద యోజన, పాల రైతుల కోసం ఈ గోపాల యాప్‌ను ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. మత్స్యకారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతూ వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో దేశంలో చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది లక్ష్యమని వెల్లడించారు
మత్స్య శాఖకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన అనేది శ్వేతవిప్లవం లాగా తీపి విప్లవానికి పునాది వేస్తుందని భరోసా వ్యక్తం చేశారు. అంతేకాదు దేశంలోని 21 రాష్ట్రాల్లో ఈ గోపాల యాప్ ద్వారా పాల ఉత్పత్తిదారులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్