శ‌ర‌ద్‌ప‌వార్‌, మహా హోంమంత్రిలకు బెదిరింపులు

శ‌ర‌ద్‌ప‌వార్‌, మహా హోంమంత్రిలకు బెదిరింపులు
 నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద‌వ్ ప‌వార్‌తో పాటు మ‌హారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఇవాళ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఆదివారం మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక‌రేకు కూడా బెదిరింపు కాల్ వ‌చ్చిన విష‌యం తెల‌సిందే.  
 
రాజ‌కీయ నాయ‌కుల నివాసాల‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు తేలింది. శ‌ర‌ద్‌ప‌వార్‌తో పాటు అనిల్ దేశ్‌ముఖ్‌ల‌ను బెదిరిస్తూ బ‌య‌టి దేశం నుంచి  కాల్స్ వ‌చ్చాయి. ఈ కేసులో పోలీసులు విచార‌ణ మొద‌లుపెట్టారు.  
 
ఆదివారం మ‌హా సీఎం నివాసం మాతోశ్రీకి ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేసి బెదిరించాడు. దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాన‌‌ని, డాన్ దావూద్ ఇబ్ర‌హీం త‌ర‌పున కాల్ చేస్తున్నాన‌ని బెదిరించిన‌ట్ల‌ పోలీసులు తెలిపారు. రాత్రి 10.30 నిమిషాల‌కు ఆ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి.  
 
సీఎం ఉద్ద‌వ్ థాక‌రేతో  దావూద్ ఇబ్ర‌హీం మాట్లాడాల‌నుకుంటున్న‌ట్లు మాతోశ్రీ ఇంట్లో ఉన్న టెలిఫోన్ ఆప‌రేట‌ర్‌కు కాల్ వ‌చ్చింది. కానీ ఆ కాల్‌ను సీఎంకు బదిలీ చేయ‌లేదు. బెదిరింపు ఫోన్ కాల్స్ రావ‌డంతో మ‌హారాష్ట్ర సీఎం నివాసం వ‌ద్ద అద‌న‌పు భ‌ద్ర‌త‌ను పెంచారు.