
పశ్చిమబెంగాల్‌లో బీజేపీ మహిళా నేతపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని బిష్ణుపూర్ ప్రాంత బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలైన రాధారాణి నస్కార్‌పై రఘుదేబ్‌పూర్‌లోని ఆమె ఇంటి సమీపంలోనే దుండగులు కాల్పులు జరిపారు.
తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే కోల్‌కొతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చేర్చారు. కాల్పుల ఘటన వెనక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ ఆరోపించారు. మహళ మోర్చా నోరు నొక్కేందుకే అధికార పార్టీ ఈ ఘాతుకానికి పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. అది బీజేపీ అంతర్గత సమస్య అని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More Stories
హిందువులకు ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక
రక్తపు మడుగులో ఇంట్లో శవమై కనిపించిన మాజీ డీజీపీ
నటి ఖుష్బూ ‘ఎక్స్’ ఖాతా హ్యాక్