ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా మాటివిలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 కు వ్యాపార భాగస్వామిగా ఒక చైనా మొబైల్ కంపెనీ ఉండటం వివాదాలు రేపుతున్నది.
ప్రస్తుతం భారత్ – చైనా సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్టా ఛైనా వస్తువులను బహిష్కరించాలని దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో మాటివి ఈ కంపెనీని వ్యాపార భాగస్వామిగా చేసుకోవడం ఆగ్రహాలు కలిగిస్తున్నది.
16 వారాలపాటు జరిగే ఈ కార్యక్రమంలో 16 మంది పోటీ దారులు లోపలకు అడుగుపెట్టారు. బిగ్‌బాస్ సీజన్ 4కు నలుగురువ్యాపార భాగస్వాములు ఉండగా, వాటిల్లో ఒకటి చైనా మొబైల్ కంపెనీ ఒప్పో. సాధారణ పరిస్థితులలో అయితే ఎవ్వరి దృష్టిని ఆకట్టుకొనెడిది కాదు.
చైనా మూకల మన దేశంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నాలు చేస్తుండటం. అంతే ధీటుగా భారతసైన్యం బదులిస్తుండటం జరగుతుంది. కొన్ని రోజుల ముందు భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన గొడవల్లో మన ఆర్మీ ఆఫీసర్ సంతోష్ తో సహా 20 మంది మన సైనికులు చనిపోయారు.
ఆ సమయంలో దేశం యావత్తు చైనా కంపెనీలను, అవి తయారు చేసే వస్తువులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమమే నడిచింది. ఆ క్రమంలో చైనా మొబైల్ కంపెనీ ఒప్పోతో డీల్ ఉన్న బీసీసీఐ వంటి పెద్ద సంస్థ కూడా ప్రజల మనోభావాల ప్రకారం సదరు ఒప్పో కంపెనీతో డీల్‌ను రద్దు చేసుకుంది. బీసీసీఐ వంటి పెద్ద సంస్థే వద్దనుకున్న చైనా కంపెనీని ఇప్పుడు మాటివి ఆశ్రయించడం పలువురి ఆగ్రహాలకు దారితీస్తుంది.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’