ఉపాధి కల్పనలో కీలకం ఆటో పరిశ్రమ 

ఉపాధి కల్పనలో కీలకం ఆటో పరిశ్రమ 
దేశ జిడిపిలో అతిపెద్ద వాటా కలిగి , అత్యధిక సంఖ్యలో ఉపాధి ఉన్న రంగంగా, ప్రస్తుత కాలంలో ఆటో పరిశ్రమ భుజస్కందాలపై చాలా ఆధారపడి ఉన్నదని  కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 
 
భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సొసైటీ (ఎస్ఐఏఎం) 60 వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆయన ప్రసంగిస్తూ సమాజం, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సమీప భవిష్యత్తులో రహదారి భద్రతా లక్ష్యాలను సాధించడంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ  వాహన తయారీదారులు వాహన భద్రతకు కీలకమైన నిబంధనలైన ఎబిఎస్, ఎయిర్‌బ్యాగులు, క్రాష్ నిబంధనలు, సీట్ బెల్ట్ హెచ్చరికలు, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, విటిఎస్ మొదలైనవి అమలు చేశారని ఆయన పేర్కొన్నారు.
 
ఈ నిబంధనలు ప్రపంచ ఆటో పరిశ్రమతో సమానంగా మన దేశ పరిశ్రమ వచ్చిందని, భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అసాధారణ సమన్వయం, నిబద్ధతతో ఇది సాధ్యమైందని గడ్కరీకొనియాడారు.
 
ప్రస్తుతానికి రోజుకు రహదారి నిర్మాణ రేటు సగటున 30 కి.మీ.గా ఉందని, అత్యధికంగా రోజుకు 40 కి.మీ హైవేలు ఉన్నాయని  గడ్కరీ తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, రహదారుల నిర్మాణంలో భారీ వృద్ధి దిశగా ఉరకలు పెడుతున్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ భారతదేశానికి ఇప్పుడు ఉందని ఆయన పేర్కొన్నారు.
 
వాహనాలను సురక్షితమైన చర్యలతో తయారుచేస్తేనే ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గవని నొక్కిచెప్పిన గడ్కరీ, సరైన రహదారి నమూనాలు పూర్తి స్థాయిలో నియమనిబంధనలు అమలు చేయడం కూడా ముఖ్యమని తెలిపారు. ఇందులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధం కావడం, భవిష్యత్తు కు అనువుగా సిద్ధంగా ఉండటం అవసరమని సూచించారు. 
 
గమనం భవిష్యత్తు, మౌలిక సదుపాయాలతో అనుసంధానం కావాలని ఆయన పిలుపిచ్చారు. ఈ మేరకు, అన్ని హైవేలు / ఎక్స్‌ప్రెస్‌వేలను అధునాతన డ్రైవర్-అసిస్టెంట్ టెక్నాలజీల అమలుకు అనువైన సరిహద్దులు గల రోడ్లు, లేన్ గుర్తులతో తయారు చేస్తున్నారని ఆయన తెలిపారు. 
 
కాగా, కరోనా సంక్షోభంతో దారుణంగా కుదేలైన దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమను ఆదుకొనేందుకు వాహన అమ్మకాలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ఆటో స్క్రాపేజీ పాలసీ సిద్ధమైందని, దీనిపై అతి త్వరలో ప్రకటన వెలువడవచ్చని తెలిపారు. వాహన విభాగ జీఎస్టీ రేటు తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నదని చెప్పారు.