రెచ్చగొట్టిన చైనా.. దీటుగా బదులిచ్చిన భారత్ 

రెచ్చగొట్టిన చైనా.. దీటుగా బదులిచ్చిన భారత్ 

Pangong Lake

వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న యథాతథ స్థితికి భంగం కలిగించేందుకు చైనా యత్నించింది. సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరు వర్గాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న సమయంలో డ్రాగన్ సైనిక కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించడం ద్వారా రెచ్చగొట్టే ధోరణిని మొదలుపెట్టింది. 

పాంగాంగ్ ట్సో్ సరస్సు దక్షిణ తీర ప్రాంతంలో యథాతథ స్థితికి ఆటంకం కలిగించేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చైనా దళాలు యత్నించాయని అంటూ  29 నుంచి 30 వ తేదీల మధ్యరాత్రి ఈ ఘటన జరిగిందని భారత సైనికులు వెల్లడించారు. 

డ్రాగన్ దుశ్చర్యను దీటుగా తిప్పికొట్టామని పేర్కొన్నారు. భారత్ – చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి చూషుల్ లో ఇరు దేశాలు బ్రిగేడ్ కమాండర్ లెవర్ చర్చలు జరుపుతున్నాయి.

‘పాంగాంగ్ ట్సో నదీ తీరాల్లో యథాతథ స్థితికి భంగం కలిగించేందుకు యత్నించిన పీఎల్ఏను భారత్  దళాలు అడ్డుకున్నాయి. మా స్థితిని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నాం. అలాగే చైనా ఉద్దేశాన్ని అడ్డుకునేందుకు ముందుంటాం’ అంటూ స్పష్టం చేశారు. 

సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించడంపై భారత సైన్యం కట్టుబడి ఉంది. కానీ అదే సమయంలో తన భూభాగాపు సమగ్రతను కాపాడటంపై కూడా అంతే నిబద్ధతతో ఉంటుందని సైనిక అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. 

మరోవంక, జ‌మ్ముక‌శ్మీర్‌లో బారాముల్లాలో భ‌ద్ర‌తా ద‌ళాల కాన్వాయ్ ల‌క్ష్యంగా గ్రనేడ్ దాడి జ‌రిగింది. అయితే అది గురిత‌ప్ప‌డంతో ఐదుగురు సాధార‌ణ పౌరులు గాయ‌పడ్డారు. అందులో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు. 

మరోవంక, బారాముల్లా జిల్లాలోని ఆజాద్ గంజ్ ప్రాంతంలో పెట్రోలింగ్ కాన్వాయ్ ల‌క్ష్యంగా దుండ‌గులు గ్ర‌నేడ్ విసిరార‌ని జ‌మ్మ‌క‌శ్మీర్ పోలీసులు తెలిపారు. అయితే గ్ర‌నేడ్ కాన్వాయ్ వెల్లిపోయిన తర్వాత పేల‌డంతో రోడ్డు ప‌క్క‌న ఉన్న ఐదుగురు పౌరుగు గాయ‌ప‌డ్డార‌ని చెప్పారు. అందులో ఇద్ద‌రి ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ద‌ని, వారిని మెరుగైన చికిత్స కోసం శ్రీన‌గ‌ర్‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు.