ప్రశాంత్ భూషణ్ కు ఒక్క రూపాయి ఫైన్

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు శిక్ష ఖరారు చేసింది సుప్రీంకోర్టు. ఒక రూపాయి జరిమాన విధించింది. సెప్టెంబర్ 15 లోపు జరిమానా కట్టకపోతే 3 నెలలు జైలు శిక్ష,3 సంవత్సరాలపాటు ప్రాక్టీస్ పై నిషేధం విధించింది. 

అరుణ్ మిశ్రా, బీఆర్ గార్గ్‌, కృష్ణ మురారిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. చీఫ్ జ‌స్టిస్ బోబ్డేతో పాటు సీనియ‌న్ న్యాయ‌మూర్తుల‌పై ప్ర‌శాంత్‌ గ‌తంలో వివాదాస్ప‌ద ట్వీట్స్ చేశారు.

సుప్రీంకోర్టు జడ్జిలు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆగస్ట్ 14న కోర్టు ధిక్కరణ కేసులో భూషణ్ ను దోషిగా తేల్చింది.

సుప్రీంకోర్టు త‌నకు రూపాయి జ‌రిమానా శిక్ష‌ను ఖ‌రారు చేయ‌గానే.. ఆ జ‌రిమానాను చెల్లించిన‌ట్లు ప్ర‌శాంత్ భూష‌ణ్ ట్వీట్ చేశారు. ఒక రూపాయి నాణెంతో దిగిన ఫోటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ట్యాగ్ చేశారు.  త‌న త‌ర‌పున కోర్టులో వాదించిన న్యాయ‌వాది రాజీవ్ ధావ‌న్‌కి ఆ నాణాన్ని అందించారు. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో సుప్రీం తీర్పును స‌గ‌ర్వంగా ఆమోదిస్తున్న‌ట్లు ప్ర‌శాంత్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్ భూషణ్సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,కోర్టుల పనితీరు పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకు, తప్పులను సరిదిద్దుకుంటారని విమర్శలు చేశానని తెలిపారు.