కోలుకున్న అమిత్‌షా.. త్వరలో డిశ్చార్జి

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలోనే దవాఖాన నుంచి డిశ్చార్జి కానున్నారని ఎయిమ్స్‌ వైద్యులు శనివారం తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న అమిత్‌షా.. అలసట, ఒళ్లునొప్పుల కారణంగా చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల చేరిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో డిశ్చార్జి చేయనున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆగష్టు 2న అమిత్‌ షాకు కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.14న పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినా ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఆయన ఈ నెల 18న ఎయిమ్స్‌లో చేరాడు.
 
‘హోంమంత్రి అమిత్ షా గత 4 రోజులుగా అలసట, శరీర నొప్పులతో బాధపడ్డారు. కోవిడ్‌-19 నెగటివ్‌ వచ్చినా ముందు జాగ్రత్తగా ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన సౌకర్యంగా ఉన్నాడు. ఆసుపత్రి నుంచే తన పనిని కొనసాగిస్తున్నాడు’ అని ఆసుపత్రి అధికారులు తెలిపారు.