సెప్టెంబర్ 10న వైమానిక దళంలోకి రాఫెల్ విమానాలు

ఫ్రాన్స్‌ నుంచి భారత్ కొనుగోలు చేసిన  రాఫెల్ యుద్ధ విమానాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చే నెల(సెప్టెంబర్) 10న అధికారికంగా భారతీయ వాయు సేనకు అప్ప‌గించ‌నున్నారు. 

అంబాలా ఎయిర్ బేస్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే కూడా హాజరుకానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటి విడతలో భాగంగా 5 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి జూలై 29న భారత్ చేరాయి. 

ఇందులో రెండు సీట్లు కలిగిన శిక్షణ విమానాలు, మరో మూడు ఒకే సీటు కలిగిన యుద్ధ విమానాలున్నాయి. విమానాలు భారత్‌ చేరిన మరుసటి రోజు నుంచే వాయుసేన శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. రెండో విడతలో రానున్న ఈ  అత్యాధునిక యుద్ధ విమానాలను పశ్చిమబెంగాల్‌లోని హస్మీరా ఎయిర్ బేస్‌లో ఉంచనున్నారు.