భారత్ టిబెట్ ఆక్రమణను గుర్తించాలి 

టిబెట్ చైనా ఆశ్రమంలో ఉన్నదని గుర్తించాలని, తద్వారా టిబెట్ సమస్యకు పరిష్కారంకు దోహదపడాలని టిబెట్ కేంద్ర పాలనా వ్యవస్థ రాజకీయ నేత గ్యారీ డోలీమా సూచించారు.  “టిబెట్ స్వాతంత్య్రంకు  అంతర్జాతీయ మద్దతు” అంశంపై జరిగిన వెబినార్ లో ప్రసంగిస్తూ ఆ విధంగా చేయడం టిబెట్ ప్రజలకే కాకుండా భారత్ రక్షణకు సహితం అవసరమని గుర్తు చేశారు. 

ఢిల్లీ వీధులలో “టిబెట్ కి ఆజాది – భారత్ కి సురక్ష” నినాదాలు తరచూ వినిపిస్తుంటాయని ఆమె గుర్తు చేశారు. భారత్ అటువంటి ప్రకటన చేయగానే ప్రపంచంలో సగంమకు పైగా దేశాలు భారత్ ను అనుసరిస్తామని ఆమె భరోసా వ్యక్తం చేశారు. 

చైనాతో తమకు ఎటువంటి సరిహద్దు లేదని, సరిహద్దు ప్రాంతం అంతా టిబెట్ దాని కూడా భారత్ స్పష్టం చేయాలనీ ఆమె కోరారు. టిబెట్ ప్రజల పట్ల, టిబెట్ పట్ల భారత్ ప్రభుత్వనానికి, ప్రజలకు ఎంతో సానుభూతి ఉంటూ వస్తున్నప్పటికీ చైనాతో సంబంధాలను దృష్టిలో ఉంచుకొని భారత్ స్పష్టమైన విధానం ఆవలంభించలేక పోతున్నదని ఆమె పేర్కొన్నారు. 

ఇక భారత్ టిబెట్ పట్ల స్పష్టమైన విధానం ఆవలంభించవలసిన సమయం వచ్చినదని, ఆ విధంగా చేయవలసిన అంతర్జాతీయ న్యాయపరమైన బాధ్యత సహితం భారత్ కు ఉన్నదని ఆమె స్పష్టం చేశారు. టిబెట్ విషయంలో చైనాను భారత్ ఇప్పుడో, తర్వాతో ఎదుర్కొనక తప్పదని ఆమె చెప్పారు. 

భారత్ ఇప్పుడు బలమైన స్థాయిలో ఉన్నదని, 1962 నాటి పరిస్థితులు లేవని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయం చైనాకు కూడా తెలుసని అన్నారు. నెహ్రు ఎప్పుడు టిబెట్ ను స్వతంత్ర దేశంగా ప్రస్తావించేవారని, ఆ మేరకు ఆయన వ్రాసిన అనేక లేఖలు ఉన్నాయని  డోలాయ తెలిపారు.

అయితే చైనా నుండి భారత్ ఎక్కువగా ఆశిస్తూ ఉండడంటంతో పరిస్థితులు క్రమంగా మారుతూ వచ్చాయని ఆమె తెలిపారు. నాటి భారత ప్రధాని, ప్రభుత్వం తమ దేశపు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా చేసారని ఆమె పేర్కొన్నారు. దానితో కొన్ని సమయాలలో టిబెట్ ను చైనాలో అంతర్భాగంగా కూడా పేర్కొంటూ వచ్చారని చెప్పారు. 

అయితే భారత్ ఆశించిన మేరకు చైనా వ్యవహరించడం లేదని అంటూ నెహ్రు మరికొంత కాలం జీవించి ఉంటె తన విధానాన్ని మార్చుకొనే వారని ఆమె తెలిపారు. ఆ మేరకు ఆయన పార్లమెంట్ లో, మీడియా సమావేశాలలో కూడా సంకేతాలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. 

లాల్ బహదూర్ శాస్త్రి అయితే ప్రవాసంలో టిబెట్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి సిద్దపడిన్నట్లు ఆమె చెప్పారు. అయితే మొదటి నుండి అనేకమంది భారత నాయకులు చైనాను విశ్వసింపడం లేదని ఆమె పేర్కున్నారు. 

1924లో జరిగిన సిమ్లా ఒప్పందంలో భారత్, టిబెట్ తమ సరిహద్దులను గుర్తించుకున్నాయని, అందుకు ఒప్పుకున్న చైనా అందులో సంతకం చేయక పోయినా ఆ ఒప్పందం అమలులో ఉన్నట్లే అని అందులోనే స్పష్టంగా పేర్కొన్నారని డోలమా వివరించారు. టిబెట్ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తిస్తూ 1965లో ఐక్య రాజ్య సమితి చేసిన తీర్మానానికి భారత్ మద్దతు ఇచ్చినది ఆమె గుర్తు చేశారు.