జర్నలిస్ట్ లకు అస్సాం రూ 50 లక్షల భీమా 

కరోనా కారణంగా ఎంతోమంది చనిపోతున్నారు. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న వైద్యులు, పోలీసులు, జర్పలిస్టులు ఇలా ఎంతోమంది ప్రతిరోజూ మృత్యువాత పడుతున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు వైద్యులు, పోలీసులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాయి. కానీ, జర్నలిస్టులకు మాత్రం కల్పించలేదు. 

తాజాగా తమ రాష్ట్రంలోని జర్నలిస్టులకు రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టులతో పాటు హోంగార్డులకు కూడా ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆ బిల్లును గురువారం అస్సాం కేబినేట్ ఆమోదించింది. విధి నిర్వహణలో జర్నలిస్టులు, హోం గార్డులు, సాధారణ ఉద్యోగులు చనిపోతే ఈ పథకం వర్తిస్తుంది.

ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బీమా సౌకర్యం కల్పించే ప్రతిపాదనను ఆమోదించినట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరీ తెలిపారు. మంగల్‌డోయిలో రూ. 900 కోట్ల అంచనా వ్యయంతో స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి అస్సాం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ బిల్లుకు ఆమోదం లభించిందని పటోవరీ తెలిపారు.