డ్రోన్ల సాయంతో పాక్ దాడుల‌కు యత్నం 

జ‌మ్మ‌కశ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వెంట ఉన్న భార‌త భ‌ద్ర‌తా సంస్థ‌ల‌పై పాకిస్థాన్ డ్రోన్ల సాయంతో బాంబు దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని బొర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్ఎఫ్‌) తెలిపింది.
ఆర్ఎస్ పురా, సాంబా సెక్ట‌ర్ వెంట ఈ దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉందంది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సైతం డ్రోన్లను ఉప‌యోగించి భార‌త్‌లోకి డ్ర‌గ్స్‌, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని చేరవేసేందుకు య‌త్నిస్తుందని వెల్లడించింది.
పాక్ ఏజెంట్ల‌ను చేర‌వేసేందుకు గ‌డిచిన‌ జూన్ 20న పాకిస్థాన్ డ్రోన్ ఓ అంత్యంత అధునాత‌న రైఫిల్‌, మ్యాగ్జిన్స్‌, ప‌లు గ్రెనేడ్లు మోసుకొస్తుండ‌గా గ‌మ‌నించిన బీఎస్ఎఫ్ క‌తువా జిల్లాలోని అంత‌ర్జాతీయ‌ స‌రిహ‌ద్దు వ‌ద్ద డ్రోన్‌ను పేల్చేసింది.
ఇటువంటి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం జ‌మ్ము ప్రాంతంలో ఇదే తొలిసారి. 2019లో సైతం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి త‌ర‌లిస్తున్న పాక్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ ప‌ట్టుకుంది. పంజాబ్ స‌రిహ‌ద్దు వెంట ప‌లు డ్రోన్ల‌ను భ‌ద్ర‌తా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
 
శ‌నివారం పంజాబ్‌లోని తార్న్ త‌ర‌న్ జిల్లాలోని స‌రిహ‌ద్దు వెంట భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించిన ఐదుగురు చొర‌బాటుదారుల‌ను భ‌ద్ర‌త బ‌ల‌గాల సిబ్బంది కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే.