సెప్టెంబర్ 30 దాకా రైళ్లు బంద్‌

సెప్టెంబర్ 30 దాకా రైళ్లు బంద్‌
కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును వచ్చే నెల (సెప్టెంబర్‌) ౩౦వ తేదీ వరకు పొడగించినట్లు తెలిపింది. 
 
ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని పేర్కొంది. ప్రయాణీకులు కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ఇంతకు ముందు ఆగస్టు 11 వరకు రైళ్ల రద్దును పొడగించింది.
 
 అలాగే ముంబైలో సిబ్బంది కోసం సబర్బన్‌ రైళ్లు నడవనున్నాయి. ప్రస్తుతం దేశంలో 6,34,945 కరోనా యాక్టివ్‌ కేసులుండగా, 15,35,743 డిశ్చార్జి కేసులున్నాయి. వైరస్‌ కారణంగా 43,386 మంది నిపోయారు.  
ఇలా ఉండగా, సోమ‌వారం కూడా కొత్త‌గా 5,914 మందికి క‌రోనా పాజిటివ్ రావడంతో తమిళనాడులో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల మార్కును దాటి 3,02,815కు చేరింది. ఇక త‌మిళ‌నాడులోకొత్త‌గా 114 మంది క‌రోనా బాధితులు మృతి చెందడంతో ఆ  రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,041 చేరింది.