ప్రధానికి హాని చేస్తానని బెదిరింపు కాల్‌!

ప్రధాని నరేంద్ర మోదీకి హాని చేస్తానని ఓ యువకుడు పోలీస్‌ అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు. పోలీస్‌ ఎమర్జెన్సీ నంబర్‌ 100కు ఫోన్‌ చేసి మరీ చెప్పాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. 
 
వెంటనే అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు సదరు యువకున్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడిని సెక్టార్ 66లో నివసిస్తున్న హర్భజన్ సింగ్‌గా గుర్తించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. హర్యానాకు చెందిన వ్యక్తని తెలిపారు. 
 
ఆ  యువకుడు ‘డ్రగ్స్‌కు బానిస’ అయ్యాడని గుర్తించారు. ‘హర్భజన్ 100 నంబర్‌కు ఫోన్ చేసి ప్రధానికి హాని తలపెడుతానని బెదిరించాడని’ మమురాకు చెందిన పోలీస్‌ అధికారి అంకుర్ అగర్వాల్ తెలిపారు. 
 
నిందితుడిని విచారిస్తున్నారని, అతడు  మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడని పేర్కొన్నారు. ఇతర వివరాలు తెలుసుకునేందుకు యువకుడిని వైద్య పరీక్షలకు తరలించామని, విచారణ కొనసాగుతున్నది వివరించారు.