సొంత గూటికి సచిన్‌ పైలెట్‌?

రాజస్థాన్‌ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభంకు తెర దించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది.  సచిన్‌ పైలెట్‌ నేతృత్వంలోని రెబల్‌ వర్గం ఎమ్మెల్యేలను సొంతగూటికి తీసుకొచ్చేందుకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక చేసిన ప్రయత్నాలు ఫలించాయని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 
 
సోమవారం మధ్యాహ్నం సచిన్‌ పైలెట్‌ రాహుల్‌ గాంధీ నివాసంలో రెండు గంటలపాటు రాహుల్‌, ప్రియాంకతో భేటి అయ్యారు. వీరి మధ్య చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొనసాగేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
సచిన్‌ పైలెట్‌ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఒక పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ అశోక్‌ గెహ్లోట్‌ పనితీరును కూడా పరిశీలిస్తుంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య అనుభవంతో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం కాస్త జాగ్రత్త పడిన్నట్లు కనబడుతున్నది.
రెండు వారాల క్రితం ఢిల్లీలోనే ప్రియాంకా గాంధీతో సచిన్‌ పైలెట్‌ సమావేశమ్యాడు. ఆ తర్వాత పరిణామాలు సానుకూలంగా మారాయి. తమ వర్గానికి చెందిన ఇతర నేతలను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకోవడంతో పాటు నామినేషన్‌ పదవులకు ఎంపిక చేయాలని పైలట్‌ హైకమాండ్‌కు స్పష్టం చేశారు.
తనను జాతీయస్ధాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పైలట్‌ హైకమాండ్‌ ముందు రాజీ ఫార్ములాను ప్రతిపాదించారు. కాగా పార్టీపై తిరుగుబాటు నేపథ్యంలో పైలట్‌ కోల్పోయిన డిప్యూటీ సీఎంతో పాటు రాజస్తాన్‌ పీసీసీ చీఫ్‌ పదవులను తొలుత చేపట్టాలని ఆయనను రాహుల్‌ కోరారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తాను తిరిగి పార్టీ గూటికి చేరాలంటే మూడు ప్రధాన డిమాండ్లను పైలట్‌ అగ్ర నేతల ముందుంచినట్టు తెలిసింది. భవిష్యత్‌లో తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తామని బహిరంగ ప్రకటన చేయడం, ఇది సాధ్యం కానిపక్షంలో తన వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలను డిప్యూటీ సీఎంలుగా నియమించాలని స్పష్టం చేశారు.
 
నెల రోజుల నుంచి రాజస్థాన్ కాంగ్రెస్ ‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌ వ్యవహార శైలికి వ్యతిరేకంగా సచిన్‌ పైలెట్‌ తిరుగుబాటు చేయగా. బిజెపితో కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్‌ పైలెట్‌ కుట్ర పన్నాడని అశోక్‌ గెహ్లోట్‌ ఆరోపించారు. 
 
తన బలప్రదర్శన కోసం అసెంబ్లీ సమావేశం జరపడానికి గత  పక్షం రోజువుగా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చివరకు ఈ నెల 14న సమావేశం జరిపేందుకు గవర్నర్ అంగీకరించారు. ఈ మధ్యలోనే రెండు వర్గాలను సర్దుబాటు చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం తికమక పడుతున్నది.