బిజెపి అంటే భయంతో ఆ పేరే ఎత్తవద్దన్న కేటీఆర్ 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరుగవలసిన సమయంలో టి ఆర్ ఎస్ ఎన్నికల బాధ్యతలను నిర్వహించే మంత్రి కె టి రామారావు బీజేపీ అంటేనే భయపడుతున్నట్లు ఉన్నది. అందుకనే ఆ పార్టీ పేరే ప్రస్తావించవద్దని పార్టీ నేతలకు సూచించారు. 
 
కేసీఆర్ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో విఫలమిస్తోన్నట్లు నగరంలో ప్రజలు భావిస్తున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. ప్రభుత్వ వైఫల్యాలను బిజెపి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఒక వైపు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మరో వైపు కరోనా బాధితులకు భరోసా కల్పించే రీతిలో ప్రభుత్వ లోపాలను ఎట్టి చూపుతున్నారు. 
 
అయితే బిజెపి నేతల విమర్శలపట్ల మౌనం వహించాలని కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిపిన సమావేశంలో ఆదేశించారు. ప్రజలు కరోనా విషయంలో ప్రజల పట్ల ఆగ్రహంతో ఉండడంతొ, ఆయా అంశాలను ప్రస్తావిస్తున్న బిజెపిని లక్ష్యంగా చేసుకొంటే అధికార పక్షానికి మరింతగా నష్టం జరుగుతోందని వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. 
 
పైగా హైదరాబాద్ నగరంలో మంచి కార్యకర్తల బలం ఉన్న బీజేపీ గ్రేట్ర్ హైదరాబాద్ ఎన్నికలలో సత్తా చూపడం కోసం సమాయత్తం అవుతున్నది. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాగలదని కేటీఆర్ గ్రహించారు. అందుకే ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తే ప్రజలలో మరింత అభాసుపాలై, బీజేపిని బలోపేతం చేసినవారం అవుతామని అభిప్రాయం కేటీఆర్ లో కనిపిస్తున్నది. 
 
అందుకనే కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేయాలని, ఆ పార్టీ నేతల విమర్శలు మాత్రమే తిప్పికొడుతూ ఉండాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాన్ని కేటీఆర్ రూపొందిస్తున్నట్లు వెల్లడి అవుతుంది. పార్టీలో సీనియర్ నేతలు పలువురు కేటీఆర్ ధోరణి నచ్చక దూరంగా ఉంటూ ఉంటున్నారు. 
 
పైగా ,  గత ఎన్నికలలో సుమారు 100 డివిజన్ లలో అధికార పార్టీని గెలిపించినా అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నా మాటలు గాలి మూటలుగా మారడంతో ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతున్నట్లు స్పష్టం కేటీఆర్ గ్రహించినట్లు కనిపిస్తున్నది. అందుకనే ఎన్నికలన్నా, బిజెపి అన్నా ఆయనలో భయం పట్టుకున్నట్లు ఆయన ధోరణి వ్యక్తం అవుతున్నది.