పాక్ కీలుబొమ్మలతో బాలీవుడ్ తారల బంధం 

పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, పాక్ సైన్యం ప్రోత్సాహంతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారి మద్దతు దారులతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సన్నిహితంగా వ్యవహరించడం చాలాకాలంగా సాగుతున్నది. భారత్ పట్ల విద్వేష ప్రచారం సాగిస్తున్న వారితో  వీరు పనిచేయడం జరుగుతున్నది.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహం ఇచ్చే విలాసవంతమైన ఆతిథ్యంలకు హాజరవడం నుండి స్వార్ధ ప్రయోజనాలకోసం ఉగ్రవాద సంస్థల కీలుబొమ్మలతో సన్నిహితంగా వ్యవహరించడం జరుగుతున్నది. భారత్‌కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని, ఇందులో భాగంగా విపరీత ప్రచారం చేస్తారని, జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేస్తారనే ఆరోపణలు ఈ ఉగ్రవాద సానుభూతిపరులపై ఉన్నాయి.
కొందరు ఉగ్రవాద ఆరోపణలున్న వారితోనూ బాలీవుడ్‌ సెలబ్రిటీల్లో కొందరికి సంబంధాలున్నాయంటూ బీజేపీ నేత వైజయంత్ పాండా చేసిన ఆరోపణల నేపధ్యంలో బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు తాజాగా వైరలవుతున్నాయి.   బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరి రెహనా సిద్దిఖీ కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న కాశ్మీరీ వేర్పాటువాది  టోనీ అషయ్ అనే నిందితులతో ఉన్న ఫోటోలు బయటపడ్డాయి.

అమెరికాలో ఉన్న టోనీ అషయ్‌తో షారుఖ్ దంపతులకు వ్యాపార సంబంధాలున్నట్లు చెబుతున్నారు. కాశ్మీర్‌కు చెందిన  టోనీపై యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక పాకిస్థానీ అయిన రెహనా సిద్దిఖీ హ్యూస్టన్ లో ఓ రేడియో ఛానల్‌ను నిర్వహిస్తున్నారని, దాని ద్వారా కాశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని ఆరోపణలున్నాయి.

బాలీవుడ్ సెలబ్రిటీలను తరచూ అమెరికాకు ఆహ్వానించి ఈ ఛానల్ ద్వారా సిద్దిఖీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారని వినికిడి. ఈయనతో కూడా షారూఖ్ దంపతులకు సంబంధాలున్నట్లు వినవస్తోంది.

ఇలా ఉండగా, బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్ లు విదేశాలలో, ముఖ్యంగా దుబాయిలో సంపాదించుకున్న ఆస్తుల గురించి దర్యాప్తు పరుపవలసి ఉన్నదని బిజెపి ఎంపీ సుబ్రమణియన్ స్వామి స్పష్టం చేశారు. వారికి గల బంగ్లాలు, ఇతర ఆస్తులను ఎవ్వరు కొనిచ్చారో తేల్చుకోవాలని స్పష్టం చేసారు.