
కరనా ప్రభావం అమర్నాథ్ యాత్రపై కూడా పడింది. వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్నాథ్ ఆలయ బోర్డు బుధవారం ప్రకటించింది. యాత్ర ఆగిపోవడం వరుసగా ఇది రెండోసారి.
పోయిన ఏడాది కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దుపై కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను మధ్యలోనే నిలిపేశారు. చేసింది. కాగా ఈ ఏడాది వైరస్ కారణంగా యాత్రను రద్దు చేశారు.
“ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యాత్రను కొనసాగించే అవకాశం లేదు. ఇది ప్రకటించేందుకు బాధగానే ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల కోసం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు చెప్పారు.
పద్ధతి ప్రకారం పూజలు అన్నీ చేస్తామని, పొద్దున, సాయంత్రం ఇచ్చే హారతిని కచ్చితంగా లైవ్ టెలికాస్ట్ చేస్తామని తెలిపారు. భక్తులను అనుమతించాలా లేదా అనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో దీనిపై సమీక్ష నిర్వహించిన లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
More Stories
రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం.. అందుకే సీబీఐ విచారణ
క్రికెట్ బుకీని పట్టించిన అమృతా ఫడ్నవీస్
రక్షణ రంగంలో భారత్, అమెరికా పారిశ్రామిక సహకారం