* వివాదాస్పద ఓఎస్‌డీ నియామకం రద్దు
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ బుధవారం బలపరీక్షలో నెగ్గారు. ఆయనకు అనుకూలంగా 144 మంది ఓటేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయిదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక డీఎంకే పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే రెబల్స్ 25 మంది షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కానీ పళనిస్వామి వర్గం మాత్రం వ్యతిరేకంగా ఓటేసింది.
పీఎంకే, బీజేపీకి చెందిన మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా నిలిచారు. ఏఎంఎంకే బహిష్కృత ఎమ్మెల్యే కామరాజు సైతం విజయ్‌కు మద్దతు ఇచ్చారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న డీఎండీకే సైతం విజయ్‌కు మద్దతు తెలిపింది. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ జేసీడి ప్రభాకర్ ప్రకటించారు.
టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో నెగ్గింది. విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఓ స్థానం ఖాళీ అయ్యింది. ఇక ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే బలపరీక్షలో పాల్గొనలేదు. అయితే విశ్వాసపరీక్ష కన్నా ముందే కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు విజయ్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో 117 మ్యాజిక్ మార్క్. బలపరీక్షపై చర్చ తర్వాత అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ తమ సర్కారు సెక్యూలర్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపారు.
తమ ప్రభుత్వం వేగవంతమైన గుర్రం తరహాలో పనిచేస్తుందని, కానీ హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడదని చెప్పారు. గత ప్రభుత్వాలకు చెందిన అన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

More Stories
కాన్వాయ్‌ను సగానికి తగ్గించిన ప్రధాని మోదీ!
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నాసిక్ నుంచే.. ఒక వ్యక్తి అరెస్ట్
సువేందు అధికారి పిఎ హత్య కేసు సీబీఐకి అప్పగింత