ఆయన తన వ్యూహాత్మక చర్యలో భాగంగా మాజీ మంత్రి, అతని సన్నిహితుడు పీ తంగమణి, పలువురు సీనియర్ నేతలను పార్టీ నుంచి తొలగించారు. అంతే కాకుండా ఆ స్థానాలను వేరే వ్యక్తులతో భర్తీ చేసి వారికి పార్టీ నుంచి బలమైన సందేశాన్ని పంపారు. రెబల్స్‌కు నాయకత్వం వహిస్తోన్న సీవీ షణ్ముగం సహా ఇతర నాయకులను పార్టీ పదవుల నుంచి తొలగించడంతో పాటు పార్టీ విప్‌ను ధిక్కరించి విజయ్‌కు ఓటేసిన 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరామని అన్నాడీఎంకే పేర్కొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది.
కాగా, తమను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని రెబల్ నేత షణ్ముగం అపహాస్యం చేశారు. బలపరీక్ష అనంతరం, షణ్ముగం విప్ నియామకాన్ని ప్రశ్నిస్తూ, ఎడప్పాడి కె. పళనిస్వామిని శాసనసభాపక్ష నాయకుడిగా ధృవీకరిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి తీర్మానంపైనా సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు. శాసనసభాపక్ష నాయకుడు, ఉపనాయకుడు, విప్ ఎన్నిక కోసం ఈపీఎస్ జరిగినట్లు పేర్కొన్న సమావేశం అసలు జరగలేదని షణ్ముగం ఆరోపించారు.

More Stories
పంజాబ్ యూనివర్సిటీ అధ్యక్ష ఎన్నిక పట్ల అమిత్ షా హర్షం
సెలవుపై రాజస్థాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి.. కొత్త నియామకం!
పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎబివిపి నేత!