అయోధ్య‌కు అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఆహ్వానం

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఆగష్టు 5న శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి ప్రకటించాపారు. కార్య‌క్ర‌మం స‌మ‌యంలో సాంఘిక దూరం  పాటించాల‌న్న ఉద్దేశంతో కేవ‌లం 150 మంది అతిథుల‌కు మాత్రమే ఆహ్వానం ప‌లికిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆ రోజు మధ్యాన్నం  12.15 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
 
శంకుస్థాప‌న స‌మ‌యంలో సుమారు 200 మంది అక్క‌డ ఉంటార‌ని స్వామి గోవింద్ దేవ్ తెలిపారు. శంకుస్థాప‌న చేయ‌డానికి ముందు ప్ర‌ధాని మోదీ అక్క‌డే ఉన్న రామాల‌యంలో పూజ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. హ‌నుమాన్ గ‌ర్హి ఆల‌యంలోనూ ప్ర‌ధాని పూజ‌లు చేయ‌నున్నారు.  అయోధ్య రాముడి ఆల‌య శంకుస్థాప‌న కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్న‌ట్లు స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు.   
 
 ఆగస్టు 3 నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 5న భూమి పూజ తర్వాత మందిరం నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పారు. బీజేపీ నేతలు ఎల్‌కే. అడ్వానీ, మురళీ మనోహర్‌‌ జోషీ, ఉమాభారతిలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని ట్రస్ట్‌ సభ్యుడు‌‌ కామేశ్వర్ చౌపాల్‌ తెలిపారు.