
ముంబైలోని తలోజా జైల్లో ఉన్న విరసం నేత వరవరరావుకు కరోనా వైరస్ సోకింది. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించింది. భీమా కోరేగావ్ కేసులో22 నెలలుగా జైల్లో ఉన్న వరవరరావును ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 13న జేజే ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగంలో చేర్చించారు. మరుసటి రోజు కరోనా పరీక్ష కోసం నమూనాలు సేకరించగా ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
‘‘వరవరరావు ఆస్పత్రిలో చేరినప్పుడు కరోనా లక్షణాలు లేవు. ముందు జాగ్రత్తగా న మూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మాది కరోనా ఆ స్పత్రి కాకపోవడంతో ఆయనను సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించాం’’ అని జేజే ఆస్ప త్రి డీన్ డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు.
ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ,పౌరహక్కుల నేతలు వెంటనే ఆయనకు చికిత్స అందించాలని డిమాండ్ చేయడంతో జైలు అధికారులు సోమవారం రాత్రి ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు.
More Stories
రాయలసీమ లిఫ్ట్‌కు పర్యావరణ అనుమతి నిరాకరణ
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
తెలంగాణ కులగణన విశ్లేషణలో ఫ్రాన్స్ ఆర్థికవేత్త?