ముందు చూపుతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 

హర్ష వర్ధన్ శృంగలా

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవ చరిత్రలో అత్యంత భారీ సంక్షోభం కోవిద్-19 సృష్టించింది. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా మరణాలకు, లెక్కలేనంతమంది జీవనోపాధి కోల్పోవడానికి దారితీసింది. ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం చాలా ఎక్కవులాగా ఉంది.

ప్రపంచ ఉత్పత్తిలో 2020లో 5 శాతం వరకు ప్రభావం చూపవచ్చని అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు చెబుతుండగా, ఆ ప్రభావంతో స్థూల జాతీయ ఉత్పత్తిపై 12 ట్రిలియన్ డాలర్ల మేరకు తగ్గే అవకాశం ఉంది.

“గొప్ప లాక్ డౌన్”గా ప్రపంచ ద్రవ్య సంస్థ పేర్కొన్న ఈపరిస్థితి నుండి ప్రపంచ ఆర్ధిక సంస్థ ఎంత త్వరగా కోలుకోగలదన్నది ఈ వైరస్ ను ఎంత త్వరగా కట్టడి చేయగలమన్న దానిపై ఆధారపడి ఉంది. భారత్ అన్ లాక్-2 లోకి ప్రవేశిస్తున్నందున ఒక వంక వైరస్ నుండి రక్షణ చర్యలను తగ్గించకుండానే ఆర్ధిక కార్యకలాపాల విస్తరణకు మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.

ఈ మహమ్మారి కలిగిస్తున్న సవాళ్ళను అంచనా వేయడం, ఎదుర్కోవడం పట్ల మనం మొదటి నుండి క్రియాశీలతతో వ్యవహరిస్తున్నాము. ప్రాణాలను కాపడం మనకు మొదటి ప్రాధాన్యత. ఈ విషయంలో, కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండగా మిగిలిన అనేక దేశాలకన్నా మెరుగుగా తక్కువ మరణాల సంఖ్య, ఎక్కువగా కోలుకొంటున్న వారి సంఖ్య ఉండేటట్లు చూడగలుగుతున్నాం.

ప్రజలను కాపాడడానికి, వైరస్ ను కట్టడి చేయడానికి మొదటి నుండే ప్రయత్నాలు చేస్తుండడం వల్లన ఇది సాధ్యమవుతున్నది. మరోవంక, ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి, అత్యవసర గదులు ఏర్పర్చడానికి, అవసరమైన పరికరాలు సమకూర్చడానికి, ఆరోగ్య సంరక్షణలో ఉన్నవారికి తగు శిక్షణ కల్పించడానికి ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నది.

ఈ మహమ్మారి కల్పించిన ఆర్ధిక సవాల్ ను ఎదుర్కోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందస్తు ఆలోచనలు గల ఆర్ధిక విధానాన్ని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ రూపంలో రూపొందించారు. సుమారు రూ 20 లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్యాకేజి ద్వారా ఒక వంక ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం, మరో వంక అణగారిన వర్గాలకు సామజిక భద్రత కలిగించడం పట్ల దృష్టి సారించారు. ఆత్మనిర్భర్ భారత్ ను ఐదు అంశాల ప్రాతిపదికపై రూపొందించారు: ఆర్ధిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, మన వ్యవస్థ, జనాభా, అవసరాలు.

స్వల్పకాలంలో సామజిక, ఆర్ధిక పరిస్థితులపై ఈ మహమ్మారి చూపే ప్రభావం నుండి ఆదుకోవడం కోసమే కాకుండా వ్యాపార, పారిశ్రామిక వర్గాలలో ఆత్మవిశ్వాసం కలిగించడానికి; మన తాయారు రంగం అంతర్జాతీయంగా పోటీపడే విధంగా చేయడానికి; మన వ్యవసాయం, చిన్న రైతులను అంతర్జాతీయ ఆహార సరఫరా చైన్ లతో అనుసంధానం చేయడం; పెట్టుబడులు, సాంకేతికతను ప్రోత్సహించడం పట్ల దృష్టి సారిస్తుంది.

ఎనిమిది రంగాలలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యానికి పెద్ద ఊతం కలిగించాము. బొగ్గు గనులు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులు, పౌర విమానం, ఇంధన పంపిణి, సామజిక మౌలిక సదుపాయాలు, అంతరిక్షం, అణు ఇంధనం. ఇదివరలో ఎక్కువగా ప్రైవేట్ భాగస్వామ్యానికి పరిమిత రంగాలను మాత్రమే అనుమతించెవాళ్ళం.

ఆత్మనిర్భర్ భారత్ కు పిలుపివ్వడం అంటే తిరిగి ఆర్ధికంగా ఒంటరిగా చేయడం కోసం కాదు. అంతర్జాతీయ సరఫరా చైన్స్ లలో భారత్ కీలక పాత్ర వహించేటట్లు చేయడం అవసరమైన లక్ష్యం. స్వదేశంలో సామర్ధ్యాలను నిర్మించడం ద్వారా ప్రపంచ మార్కెట్ లలో అవాంతరాలను పరిష్కరించేందుకు కూడా దోహదపడతాము.

స్వదేశంలో ఉత్పత్తిని పెంచుకొని, అంతర్జాతీయంగా ఎక్కువగా లభించేటట్లు చేయగల ఉత్పత్తులు, వస్తువులను గుర్తించడం చాల అవసరం. మనం అన్ని వస్తువులను తయారు చేయలేక పోయినప్పటికీ, మనం తప్పనిసరిగ్గా ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న వస్తువులకన్నా అనేక ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయగలం.

మహమ్మారిని ఎదుర్కోవడం, ఆర్ధిక వ్యవస్థను పునరుద్దరించడంలో అంతర్జాతీయంగా వ్యవహరించడం, సహకారం పొందడం చాల అవసరం. పరస్పరం సమన్వయంతో వ్యవహరించే విధంగా చేయడం కోసం ప్రపంచ నాయకులను సమీకరించడంలో ప్రధాని చొరవ చూపారు.

ఈ సందర్భంగా భారతీయ ఇతిహాసాలు ప్రబోధించే విధంగా మొత్తం ప్రపంచం ఒకే కుటుంభం `వసుధైక కుటుంభం’ అనే భావనతో భారత్ వ్యవహరిస్తున్న అంశాన్ని సహితం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 120 దేశాలకుఔషధాలను పంపిణి చేయడం, పొరుగు దేశాలతో ఉమ్మడి వ్యూహం రూపొందించడం, మన ప్రజలను కాపాడుకొంటూనే నిర్దిష్ట సహకారం కోరిన దేశాలను ఆదుకోవడం ద్వారా ప్రధాని ఈ భావాన్ని వ్యాపింప చేశారు.

అంతర్జాతీయకరణ భవిష్యత్, అంతర్జాతీయ వ్యవస్థ వ్యవస్తీకృత పరిమితుల పట్ల కూడా ఈ మహమ్మారి చర్చను లేవదీసింది. అంతర్జాతీయ సహాకారం కోసం ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లలో గల లోపాలను లేవనెత్తడానికి వర్చ్యువల్ సదస్సులు ఉపయోగకరమైన వేదికలుగా మారాయి. బహువిధ సహకారానికి ప్రజలు కేంద్రంగా గల భారత దేశపు దృష్టిని వివరించడానికి కూడా ఇవి ఉపయోగపడ్డాయి. జి-20, అలీనాదేశాలు వంటి అంతర్జాతీయ సదస్సులలో ప్రధాని ఈ అంశాలను ప్రస్తావించారు.

దౌత్యపర కార్యక్రమాలకు ఈ మహమ్మారి ఆటంకం కలిగించడంతో దాదాపు అన్ని అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు రద్దయ్యాయి. సంక్లిష్ట అంశాల పరిష్కారానికి లేదా క్లిష్టమైన సంప్రదింపులకు ముఖాముఖిగా కలవడం సాంప్రదాయకంగా వస్తున్నది. అయితే అవి సాధ్యంకానంత మాత్రం చేత దౌత్యపర సంప్రదింపులు నిలిపివేయలేము. చిరకాలంగా వస్తున్న దౌత్యపర విధానాలు, నూతనంగా ఇంటర్ నెట్ ద్వారా ఏర్పడుతున్న సంప్రదాయాల మధ్య సామీప్యతకు విదేశాంగ మంత్రిత్వ శాఖలో మేము ప్రయత్నం చేస్తున్నాము.

ఇటువంటి మహా ఉపద్రవం ఎదురైనప్పుడు అంతర్జాతీయంగా సమన్వయంతో వ్యవహారించడం, నిరంతరం వివిధ దేశాల మధ్య సమాచారం పంచుకొంటుండటం చాలా అవసరం. భారత్ – చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వద్దతో పాటు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తలు పెరుగుతూ ఉండడం నిరంతరం సమాచారం పంచుకోనే ప్రాధాన్యతను వెల్లడి చేస్తుంది. అందుకనే దౌత్యపరంగా నూతన పరిస్థితులకు అనువుగా వ్యవహరించాలి.

వైద్య సహాయం, ఇతర సహాయం అందించడానికి వర్చువల్ దౌత్యం అనుసరించాము. ఆ విధంగా 89 దేశాలకు రూ 82 కోట్ల విలువ చేసే అత్యవసర మందులు, టెస్ట్ కిట్లు, రక్షక పరికరాలు సరఫరా చేసాము. ప్రస్తుత కష్టమైన సమయంలో కూడా తన అంతర్జాతీయ హామీల పట్ల భారత్ నమ్మకంగా, జవాబుదారీతనంగా వ్యవహరించింది.

ఆరోగ్య భద్రత, ఆరోగ్య సరఫరాలు అంతర్జాతీయంగా ప్రభుత్వాల ప్రాధాన్యత అంశాలుగా మారడంతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనువుగా భారత్ వ్యవహరిస్తూ వస్తున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియకు భారత్ దౌత్యం మద్దతుగా నిలుస్తున్నది. భారత్ ను ప్రత్యామ్న్యాయ తయారు, వినూత్నత కేంద్రంగా పెంపొందించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ క్రియాశీలంగా కృషి చేస్తున్నది.

అది దౌత్యం కానీయండి లేదా ఆర్ధిక వ్యవస్థ కానీయండి, విధాన నిర్ణయాలు కానీయండి సమాజంలో అన్ని సందర్భాలలో మనం నేర్చుకోవలసిన పాఠాలున్నాయి. నేడు మనముందున్న సవాళ్ళలో అవి మన వ్యవస్థను, మన అకుంఠిత దీక్షను, మన దేశాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడగలవని నేను విశ్వసిస్తున్నాను.

(హర్ష వర్ధన్ శృంగలా భారత ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శి)