ప్రధాని మోదీ పదేళ్లలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తింపు తెచ్చేలా చేశారని, అభివృద్ధి, సంక్షేమం సమానంగా తీసుకెళ్లి ఆదర్శ పాలన అందించారని పీయూష్ గోయల్ కొనియాడారు. మోదీ మేక్ ఇండియా 2047 లక్ష్యాలను సాధించాలని, యువత ఇందులో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
పేదల కోసం పూర్తిగా ఉచిత బియ్యం మోదీ అందించారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల ఉచిత వైద్య సేవలు కల్పించారని, ప్రతి ఇంటికి కుళాయి, మరుగుదొడ్డి నిర్మాణం సాకారం చేశారని తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీటికొరత లేకుండా చేశారని, నారీ శక్తి ద్వారా మహిళలు వివిధ రంగాల్లో నిలబడేలా చేశారని, స్వతంత్య్రంగా ఎదగడానికి అనేక రుణాలు అమల్లోకి తెచ్చారని, ఏపీలో అనేక కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలను నెలకొల్పారని పీయూష్ గోయల్ వివరించారు.
కాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. ఆయనతో పాటు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, జాయింట్ సెక్రటరీ శివప్రకాశ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరు సమావేశమయ్యారు.
టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యాచరణపై వీరు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిపారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ జరుపతలపెట్టిన రాష్ట్ర పర్యటన, బహిరంగ సభల ఏర్పాటు గురించి చర్చించారు.
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి