
భారత్ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 500 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. చైనా, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా తర్వాత ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విదేశీ మారక నిల్వలు భారత్ వద్ద ఉన్నాయని ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) గణాంకాలు చెబుతున్నాయి.
భారతదేశం విదేశీ మారక నిల్వలు దాదాపు దేశీయ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి)లో ఐదింట ఒక వంతుతో సమానం. 13 నెలల దిగుమతులను కవర్ చేయడానికి ఇవి సరిపోతాయని భావిస్తారు. ఇది దేశానికి చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఇది ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపింది. రెండు నెలలకు పైగా కఠినమైన లాక్‌డౌన్ తర్వాత భారత్ తన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
మొదటి త్రైమాసికంలో అరుదైన కరెంట్ -అకౌంట్ మిగులు, స్థానిక స్టాక్ మార్కెట్లోకి రాకపోకలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఊపందుకున్నాయి. గత రెండు నెలల్లో రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లలో ప్రధాన పెట్టుబడులతో సహా భారతదేశ విదేశీ మారక నిల్వలు మంచి ఉత్సాహం పొందాయి. జూన్ వరకు జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు మొత్తం 25 బిలియన్ డాలర్లు విదేశీ మారక నిల్వలను సేకరించడానికి ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు దోహదం చేసింది.
అధిక విదేశీ మారక నిల్వలు కలిగి ఉండటం మార్కెట్ అస్థిరతను నిరోధించడంలో దోహదం చేస్తుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం మూడు నెలల గరిష్టానికి చేరింది. శుక్రవారం రూపాయి మారకం విలువ 75 దిగువకు చేరింది. డాలర్‌పై రూపాయి 42 పైసలు పెరిగి 74.59కు చేరింది. మార్చి 27 నంచి ఈ స్థాయికి రావడం ఇదే ప్రధమం.
More Stories
క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
మార్కెట్లో ప్రవేశించిన రూ 500 నకిలీ నోట్లు
యుద్ధ రహస్యాలు ఇంట్లో లీక్ చేసిన అమెరికా రక్షణ మంత్రి!