రూ 62 వేల కోట్ల ఐటీ రిఫండ్స్‌

రూ 62 వేల కోట్ల ఐటీ రిఫండ్స్‌
గడిచిన రెండు నెలల్లో 20 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ రూ.2,361 కోట్ల రిఫండ్‌ చెల్లింపులు జరిపింది ఆదాయ పన్ను శాఖ. ఏప్రిల్‌ 8 నుంచి జూన్‌ 30 మధ్యకాలంలో ఈ రిఫండ్‌ చెల్లింపులు జరిపినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. 
 
వీటిలో 19.07 లక్షల వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు రూ.23,453.57 కోట్ల రిఫండ్‌ చేసిన ఐటీ శాఖ, కార్పొరేట్‌ ట్యాక్స్‌ కింద 1.36 లక్షల మందికి రూ. 38,908.37 కోట్ల చెల్లింపులు జరిపింది. అంటే గడిచిన రెండు నెలల్లో ఒక్క నిమిషానికి 76 కేసులను పరిష్కరించినట్లు, ఈ 56 రోజుల్లో భారీ స్థాయిలో రిఫండ్‌ చెల్లించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక వెల్లడించింది. 
 
పన్ను చెల్లింపుదారులకు సంబంధించి బ్యాంక్‌ ఖాతాల్లో ఈ రిఫండ్‌ జమ చేయడం జరుగుతున్న దని, ఈ రిఫండ్‌ గురించి ఎవరు డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రిఫండ్‌కు సంబంధించి ఆదాయ పన్ను శాఖ పంపిన ఈ-మెయిల్స్‌కు వెంటనే స్పందించాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది.   
 
ఇలా ఉండగా, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారులకు గొప్ప ఊరట లభించింది. నెలసరి, త్రైమాసిక జీఎస్టీఆర్‌-3బీ రిటర్నుల దాఖలు ఆలస్యానికిగాను గరిష్ఠ ఫీజు పరిమితిని ఒక్కో రిటర్నుకు రూ.500లుగా నిర్ణయించారు. జూలై 2017 నుంచి జూలై 2020 వరకున్న వ్యవధికిగాను ఈ నిర్ణయం తీసుకున్నారు.