ప్రభుత్వం నుండి రాజీవ్ ఫౌండేషన్ కు నిధులు

ప్రభుత్వం నుండి రాజీవ్ ఫౌండేషన్ కు నిధులు

గాల్వాన్ వద్ద భారత్ – చైనా సైనికుల ఘర్షణ గురించి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుండగా ఆశ్చర్యకరమైన అనేక అంశాలు వేస్తుండడంతో మరిన్ని తలెత్తుతున్నాయి.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కేవలం చైనా రాయబార కార్యాలయం నుండే కాకుండా చైనా ప్రభుత్వం నుండి కూడా 2005 నుండి 2009 మధ్య కాలంలో విరాళాలు తీసుకొన్నట్లు వెల్లడైనది.

సోనియా గాంధీ అధ్యక్షురాలిగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మన్మోహన్ సింగ్, చిదంబరం సభ్యులుగా ఉన్న రాజీవ్ ఫౌండేషన్ వార్షిక నివేదికలలో చైనా నుండి విరాళాలు తీసుకోవడమే సమస్య కాదని తెలుస్తున్నది.

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి కూడా ఒక సారి మాత్రమే గాక మూడు సార్లు నిధులు స్వీకరించిన్నట్లు వార్షిక నివేదికలు వెల్లడి చేస్తున్నాయి.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి నిధులు కేటాయించడం మాత్రమే కాకుండా, పలు ప్రభుత్వ శాఖలు , ప్రభుత్వ రంగ సంస్థలు కూడా 2005 నుండి 2013ల మధ్య నిధులు సమకూర్చిన్నట్లు వార్షిక నివేదికలు తెలుపుతున్నాయి.

హోమ్, హెచ్ ఆర్ డి, ఆరోగ్యం – కుటుంభం సంక్షేమం, పర్యావరణ – అడవులు, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, మహిళా – శిశు సంక్షేమం వంటి మంత్రిత్వ శాఖలు, వాటికి సంబంధించిన విభాగాలు నిధులు సమకూర్చాయి. 

ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో ఎల్ ఐ సి, సెయిల్, గైల్, ఆయిల్ ఇండియా, ఎస్ బి ఐ, బ్యాంకు అఫ్ మహారాష్ట్ర, హుడ్కో, ఓ ఎన్ జి సి, ఐడీబీ బ్యాంకులు నిధులు అందించాయి.