భారత్ – చైనాల మధ్య ఉద్రిక్తలు తగ్గుముఖం పట్టలేదు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) దగ్గర ఇరు దేశాలు సేనలను మోహరింప చేస్తున్నాయి. ఎల్ఏసీ దగ్గర చైనీస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుండటంతో మన దేశం కూడా అంతే ధీటుగా సమాయత్తం అవుతున్నది.
తూర్పు లడఖ్ లో మన దగ్గరి అత్యంత అడ్వాన్స్డ్ క్విక్ రియాక్షన్ సిస్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్ ను మోహరించింది. ఇది భూమి నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. చైనా ఫైటర్స్, చాపర్స్ ఎలాంటి దాడి చేసినా వాటిని నేలకూల్చే విధంగా మిస్సైల్ ను ఇక్కడకు తరలించారు.
” ప్రస్తుతం కొనసాగుతున్న టెన్షన్ల నడుమ మన సైన్యం వైమానిక బలగాలతో పాటు ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ ను మోహరించాం. చైనా ఫైటర్స్, హెలికాప్టర్స్ నుంచి ఎలాంటి దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం చేశాం ” అని ఓ సీనియర్ అధికారి ప్రకటించారు.
కొన్ని రోజులుగా ఎల్ఏసీ కి దాదాపు 10 కిలోమీటర్లదూరంలో ఫైటర్స్, యుద్ధవిమానాలు, బాంబర్స్ ను వదిలే చాపర్స్ తో చైనా చక్కర్లు కొడుతోంది. దీంతో మన దేశం కూడా అలర్ట్ అయ్యింది. చైనా వైపు గల్వాన్ నది దగ్గర నల్లటి టార్ప్‌లైన్లు ఉన్నట్టు ఉపగ్రహ ఇమేజ్ ద్వారా తెలిసింది.
More Stories
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
కోల్కతా పోలీస్ కమిషనర్పై వేటుకు మమతా సమ్మతి