ఒక వంక సోనియా గాంధీ కుటుంభంకు చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుండి, కేంద్ర ప్రభుత్వ శాఖల నుండి, ఆర్ధిక నేరస్థుల నుండి భారీ వివరాలు అందిన్నట్లు కధనాలు వెలువడుతుండగా, దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉన్న ఫౌండేషన్ కార్యాలయం గల జవహర్ భవన్ పై బిజెపి ఎంపీ డా. సుబ్రమణియన్ స్వామి వివాదం లేవనెత్తారు.
ఆ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు. వాస్తవానికి 1988లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కుటుంభం ట్రస్ట్ కోసం ఉపయోగించువుకున్తున్నట్లు 2015లో తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పిటిషన్ దాఖలు చేసిన్నట్లు ఆ లేఖలో డా. స్వామి తెలిపారు.
జవహర్ లాల్ నెహ్రు శతజయంతికి ఒక సంవత్సరం ముందు 1988లో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఢిల్లీలో సంపన్నమైన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఆ స్థలాన్ని కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు రూ 500 కోట్ల విరాళాలు వసూలు చేశారు.
చాలా కార్పొరేట్ సంస్థలు కూడా విరాళాలు ఇచ్చాయి. ఆ భవనంను ధీరుభాయి అంబానీ నిర్మించారన్నది బహిరంగ రహస్యమే. ఆ విధంగా పార్టీ కోసం నిర్మించిన భవనంలో కుటుంభం ట్రస్ట్ కు వాడుకొంటూ సోనియా కుటుంభం భారీ మోసానికి పాల్పడుతున్నారని డా. స్వామి ఆరోపించారు.
రాజీవ్ గాంధీ హత్య జరిగిన 30 రోజుల తర్వాత 1991లో సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి, కాంగ్రెస్ పార్టీ కోసం నిర్మించిన భవనాన్ని కైవసం చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇంకా పాతబడిన, శిధిలావస్థలో ఉన్న, సోనియా గాంధీ నివాసానికి పొరుగున ఉన్న 24, అక్బర్ రోడ్ లోనే కొనసాగుతున్నది.
2009లో కేంద్ర ప్రభుత్వం దీనదయాల్ ఉపాద్యాయ రోడ్ లో అన్ని రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయించింది. పెద్దగా ఆర్ధిక వనరులు లేని వామపక్షాలు కూడా తమ పార్టీల కార్యాలయాలను నిర్మించుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నిర్మించలేదు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు సోనియా చైర్మన్ కాగా, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, మన్మోహన్ సింగ్, చిదంబరం సభ్యులు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు