గాల్వన్  మరణాలు చెప్పడానికి సిగ్గుపడుతున్న చైనా   

గాల్వన్ లోయలో ఘర్షణ జరిగి రెండు వారాలు అవుతున్నా అందులో  తమని తమ సైనికులు మృతి చెందారో చెప్పడానికి చైనా సిగ్గుపడుతున్నట్లు కనిపిస్తున్నది. చైనా నిరంకుశ పాలకుల చరిత్ర చూస్తే ఎప్పటికి ఆ సంఖ్యను అధికారికంగా చెప్పే ధైర్యం ప్రదర్షింపలేక పోవచ్చు. 

భారతీయ, అమెరికా నిఘా వర్గాల నివేదికలను ఉపయోగించి, చైనా ప్రతిస్పందనను గమనిస్తే జూన్ 15న జరిగిన ఘర్షణలో మనకన్నా చైనా ఎక్కువగా నష్టపోయిన్నట్లు స్పష్టం అవుతుంది. 

యుద్ధ చరిత్రలో ఒక దేశం తమ నష్టాలను దాచడానికి తమ పౌరులు, సైనికుల స్థైర్యం కాపాడుకోవడమనే ఒకే ఒక కారణం ఉంటుంది. అయితే హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే   భారతీయుల  మనోభావాలను కాపాడటానికి తాము  ప్రాణనష్టాన్ని వెల్లడించడం లేదని చైనా పేర్కొంది. ఇది చాలా బలహీనమైన వాదన.  మన మనోభావాలను కాపాడటానికి వారు తమ సొంత ప్రజల ధైర్యాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

చైనా వైపు 35 మంది మరణించినట్లు అమెరికా నిఘా వర్గాలు సూచించిన్నటు ఆ మరుసటి రోజుననే యుఎస్ న్యూస్ కధనాన్ని ప్రచురించింది. పైగా చైనా వైపు నుండి ఎవ్వరు ఘర్షణకు ఆదేశం ఇచ్చారో కూడా ఆ తర్వాత మరిన్ని వివరాలు ఇచ్చారు. 

ఈ నివేదికలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారి, భారతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందాయి. చైనాలో కఠినమైన సెన్సార్ షిప్ అమలులో ఉన్నప్పటికీ చైనా ప్రజలకు ఈ నివేదికలు చేరకుండా ఉండడం అసంభవం. కనీసం విదేశాలలో ఉన్న  వేలాది మంది చైనా విద్యార్థులు, వివిధ వృత్తులు చేస్తున్న వారి ద్వారా ఈ నివేదికల కధనాలు స్వదేశానికి చేరే అవకాశాలు ఉన్నాయి. 

ఈ నివేదికలను చైనా ఇప్పటికి  అధికారికంగా గాని లేదా అనధికారికంగా గాని  ఖండించడం గాని లేదా సవాల్ చేయడం గాని చేయ లేదు. 

వుహాన్ కరోనా వైరస్ కారణంగా అధికారికంగా 4,634 మంది చనిపోయిన్నట్లు చైనా చెబుతున్నది. ఈ సంఖ్యను సహేతుకంగా ఆలోచించే ఏ వ్యక్తి కూడా సీరియస్ గా తీసుకోవడం కష్టం. వుహాన్ నగరంలోనే 35,000 వరకు మృతి చెందారని కొన్ని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇక్కడ అధికారిక మరణాలు సుమారు 5,000 మాత్రమే. 

వేల కొద్దీ లేదా బహుశా లక్షలాది కరోనా మరణాలను చైనా దాచగలిగితే, కొద్దీ డోజన్ల మంది వాస్తవాధీన రేఖ వద్ద సేనలు మృతి చెందడాన్ని దాచడం కష్టం కాబోదు. 

వాస్తవానికి సంఘర్షణ జరిగిన రోజుననే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకులు, రిపోరేటర్లు ఆశ్చర్యకరమైనన్ని సార్లు చైనా “భయపడ లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా నిస్పృహతో తమకు తామే భరోసా ఇచ్చుకోవడం గెలుపొందిన వారి నుండి ఊహించలేము.

క్షేత్ర స్థాయిలో ఘోరంగా విఫలమైన చైనా ఇప్పుడు మానసిక యుద్ధం మాత్రమే చేస్తున్నది. గ్లోబల్ టైమ్స్ లోని పోస్టర్లు, వీడియోలు భారతీయులను భయపెట్టలేవు.

దురదృష్టకరమైన అంశం ఏమిటంటే భారత దేశం లోని కొన్ని వర్గాలే జూన్ 16 ఉదయం నుండి మన సేనల స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. భారీ సైనిక విజయాన్ని కప్పి పుచ్ఛి, చైనా అనుకూల దృశ్యాలను సృష్టించడం ద్వారా మనలను అవమానపరచే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ వ్యక్తులు ఎవ్వరు? వారి ఉద్దేశ్యాలు ఏమిటి? ఏది ఏమైనా బిజెపి అధికారం కోల్పోవాలని నిస్పృహతో ఉన్న వ్యక్తులా? మోదీ ప్రభుత్వం వ్యాపారానికి దూరంగా ఉంచుతున్న  ఆయుధాల డీలర్లా?  చైనాకు అనుకూల ప్రచారానికి భూమిక ఏర్పాటు చేసింది ఎవ్వరు? ఎందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. సమీప భవిష్యత్తులో కాబోదు. అటువంటి చైనా భారత్ ను నిరంకుశ, ఫాసిస్ట్  వ్యవస్థగా చిత్రీకరించడం ద్వారానే భారత్ కు వ్యతిరేకంగా ప్రపంచ అభిప్రాయాన్ని ఏర్పర్చగలమనే ఒకే ఒక ఆశ ఉంది. 

ముఖ్యంగా భారత ప్రభుత్వాన్ని నాజీల వంటి వారు నడుపుతున్నారని, భారత సైనికులు క్రూర దురాక్రమణ దారులని ప్రపంచం అనుకోవాలని వారు కోరుకొంటున్నారు. వీటన్నింటికి మించి, భారత్ ఆగష్టు, 2019లో జమ్మూ, కాశ్మీర్, లడఖ్ లను “ఆక్రమించు” కొన్నట్లు  ప్రపంచం భావించాలని కోరుకొంటున్నారు. 

ఇప్పుడు, మన దేశంలోనే  గత 6-9 నెలలుగా భారత్ ను అప్రదిష్టపాలు చేస్తూ ఇటువంటి మాటలే చెబుతున్నది ఎవ్వరు? ప్రతి వారు వినాలని చైనా కోరుకొంటున్న విధంగా వారి మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? భారత్ ను అప్రదిష్టపాలు చేస్తున్న వారి నిజమైన లక్ష్యాలు, ప్రయోజనాలు ఏమిటి? 

జూన్ 15 రాత్రి వాస్తవాధీన రేఖ వద్ద చైనీయులకు భారత సేనలు గట్టి  జవాబిచ్చాయి . అయితే మన సరిహద్దులకు చాల లోపలగా నీడ వలే  పనిచేస్తున్న సైన్యం చైనాకు ఉండి ఉండవచ్చు. అటువంటి శక్తుల పట్ల మనం మరింత జాగృత వహించ వలసిందే.