మణిపూర్‌లో మళ్లీ బిజెపి పంచన చేరిన ఎన్‌పిపి

మణిపూర్‌లో రాజకీయం మరో మలుపు తీసుకుంది. రాష్ట్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం మద్దతు నుండి వైదొలిగిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పిపి) తొమ్మిది రోజుల గడిచాక. మళ్లీ తిరిగి ఆ గూటికే చేరింది. సంకీర్ణ ప్రభుత్వానికే మద్దతిస్తామని గురువారం ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. దానితో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సుస్థిరతకు భరోసా ఏర్పడింది. 
 
ప్రభుత్వంకు మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన ఈ నేతలు గత వారం జరిగిన రాజ్యసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికే ఓట్ వేయడం గమనార్హం. ఈ నెల 17న బిజెపి ప్రభుత్వం నుండి వైదొలిగిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు (వీరిలో ముగ్గురు బిజెపి, ఇద్దరు కాంగ్రెస్‌).తిరిగి బిజెపి శిబిరంపై చేరుకున్నారు.
న్యూఢిల్లీ నుండి ఇంపాల్‌కు చేరుకున్న అనంతరం మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్‌పిపి అధినేత కోన్రాడ్‌ సంగ్మా ఈ విషయాన్ని తెలిపారు. ఆయనతో పాటు ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌, అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంత్‌ బిశ్వాస శర్మ కూడా ఉన్నారు.