టీ విక్రేత కుమార్తె వైమానిక దళ పైలట్‌

సంకల్పం.. పట్టుదల… కృషి ఉంటే కలలను సాకారానికి ఏమీ అడ్డుకోలేవు. ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు 24 ఏళ్ల అంచల్‌ గంగ్వాల్‌. ఓ సాదారణ టీ విక్రయదారుడి కుమార్తె భారత వైమానిక దళంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆమె తన ఆశయాన్ని సాధించుకున్నారు. 
 
‘ఇది మా కుటుంబానికి గర్వకారణం, ఆమెను చూడ్డానికి కరోనా వైరస్‌ ఆంక్షల కారణంగా దుండిగల్‌లోని వైమానికి దళం అకాడమీకి చేరుకోలేకపోయాం’ అని నీముచ్‌ జిల్లాలోని బస్టాండ్‌లో టీలు విక్రచించే అంచల్‌ గంగ్వాల్‌ తండ్రి సురేష్‌ గంగ్వాల్‌ తెలిపారు. 
 
2013 కేదార్‌నాథ్‌ విషాదంలో ప్రజలకు సహాయం చేయడంలో సిబ్బంది దైర్యాన్ని చూసి తన కుమార్తె భారత వైమానిక దళంలో చేరాలని కలలు కన్నట్లు సురేష్‌ తెలిపారు. ఈ కలను చేరుకోడం అంత సులభం కాదు, కానీ అంచల్‌ సాధించిందని ఆయన తెలిపారు. 
 
చదువులో ఎప్పుడూ ముందుండే అంచల్‌ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి. పలుసార్లు ప్రయత్నించి విఫలమైనప్పటికీ వెనుకడుగు వేయలేదు. చివరికి ఆరో ప్రయత్నంలో ఆరోసారి ప్రయత్నంలో డిఫెన్స్‌ ఫోర్స్‌లో విజయం సాధించింది. 
 
భోపాల్‌ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీముచ్‌లో గత 25 సంవత్సరాలుగా టీ అమ్ముతున్న సురేష్‌కు గంగ్వాల్‌, ఆమె కుమార్తె అంచల్‌కు ఈ ప్రమాయణం అంత తేలికైనది కాదు.  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అంచల్‌ గంగ్వాల్‌ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
 
 ‘నీముచ్‌లో టీ షాపు నడుపుతున్న సురేష్‌ గంగ్వాల్‌ కుమార్తె అంచల్‌ ఇప్పుడు వైమానిక దళంలో యుద్ధ విమానం నడుపుతోంది. దేశానికి, మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి ఇది గర్వకారణం. ఈ విజయానికి నీకు అభినందనలు’ అని చౌహాన్‌ ట్వీట్‌ చేశారు.