తెలంగాణలో రోజుకు 43 మంది రైతుల మృతి 

తమది రైతు ప్రభుత్వం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెబుతూ ఉంటారు. అయితే ఆయన పాలన రైతులకు మరణశయ్యగా మారిందా? రోజుకు సగటున 43 మంది రైతులు చనిపోతున్నట్లు వెల్లడి కావడంతో ఆందోళన కలిగిస్తున్నది.

గత 22 నెలల్లో (665 రోజులు) 28,480 మంది రైతులు చనిపోయినట్లు రైతు బీమా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే సగటున రోజుకు 43 మంది రైతులు చనిపోతున్నారు. 15 ఆగస్టు 2019 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 28,480 మంది రైతన్నలు చనిపోగా వారి కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పున ఎల్ఐసీ నుంచి రూ .1,424 కోట్లు సహాయం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ పథకం 2018 ఆగస్టు 14వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రైతు బీమా దో వ్యవసాయశాఖ సమగ్ర నివేదిక తయారు చేసింది. 60 ఏళ్లలోపు పట్టాదారు రైతులంతా రైతు బీమాకు అర్హులుగా ప్రభుత్వంద్వారా ఎంతమంది రైతు కుటుంబాలకు పరిహారం అందిం ప్రకటించింది. దీని ప్రకారం 2018 లో 31.27 లక్షల మంది రైతులు రైతు బీమాలోకి వచ్చారు .

ఈ పథకాన్ని ఎల్ఐసీతో కలిసి వ్యవసాయ శాఖ అమలు చేస్తోంది. ఒక్కో రైతుకు రూ. 2,271.50 (జీఎస్టీ కలుపుకొని) చొప్పున ప్రభుత్వం మొత్తం రూ.710.50 కోట్లు ఎల్ఐసీకి చెల్లించింది.  2019 ఆగస్టు 13వ తేదీ వరకు బీమా పరిధిలో ఉన్న 17,519 మంది రైతులు దురదృష్టవశాత్తు చనిపోయారు. వారి వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఎల్ఐసీకి ఆన్‌‌లైన్లో పంపించగా రూ . 5 లక్షల చొప్పున రూ . 875.95 కోట్లు పరిహారం చెల్లించింది.

అంటే కట్టిన ప్రీమియం కంటే క్లెయిమ్స్ రూపంలో ఎక్కువ చెల్లించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. అదే సమయంలో 2019లో 32.16 లక్షల మంది అర్హులైన అన్నదాతలు రైతు బీమాలోకి వచ్చారు. ఒక్కో రైతుకు రూ. 3,157.40 ప్రీమియం చొప్పున ప్రభుత్వం ఎల్ఐసీకి రూ .1,065.37 కోట్లు చెల్లించింది.

ఇందులో ఇప్పటివరకు 10,961 రైతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పున రూ .548 కోట్ల పరిహారాన్ని ఎల్ఐసీ చెల్లించింది. 2018లో సగటున 47మంది చనిపోగా 2019 లో 43 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.