పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బిఎస్‌ఎఫ్‌

 జమ్ముకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాకిస్తాన్‌ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) శనివారం కూల్చివేసింది.
 
బీఎస్ఎఫ్ 19 బెటాలియ‌న‌కు చెందిన పెట్రోలింగ్ బృందం ఆ డ్రోన్‌ను చూసింది.  బీఎస్ఎఫ్ ద‌ళాలు మొత్తం ఎనిమిది రౌండ్లు పేల్చి ఆ పాక్ డ్రోన్‌ను కూల్చివేశారు.  ఇవాళ ఉద‌యం 5.10 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
 
పన్సార్ బోర్డ‌ర్ పోస్టు వ‌ద్ద పాక్ నిఘా డ్రోన్ విహ‌రిస్తున్న‌ట్లు బీఎస్ఎఫ్ ద‌ళాలు గుర్తించాయి.  డ్రోన్‌ను గుర్తించిన స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ దేవేందర్ సింగ్ 9ఎంఎం బారెట్టా గ‌న్‌తో ఎనిమిది రౌండ్ల కాల్పులు జ‌రిపారు.  
 
ప‌న్సార్ బోర్డ‌ర్ ఔట్‌పోస్టు వ‌ద్ద డ్రోన్ కుప్ప‌కూలింది. భార‌త్ వైపున ఉన్న అంత‌ర్జాతీయ బోర్డ‌ర్‌కు 250 మీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.డ్రోన్ కూల్చివేత‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది.