రాజ్యసభలో 75 నుండి 86కు పెరిగిన బిజెపి బలం 

రాజ్యసభ ఎన్నికలు పూర్తి కావడంతో బిజెపి బలం 75 సీట్ల నుండి 86కు పెరిగింది. మొత్తం ఎన్డీయే సభ్యుల బలం 100 సీట్లకు పెరిగింది. అయితే పూర్తి ఆధిక్యతను కొంచెం వెనుకబడి ఉంది. కానీ రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతుంది.

మొత్తం 61 సీట్లకు ఎన్నికలు  జరుగగా, మార్చ్ లో 42 సీట్లకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. శుక్రవారం 10 రాష్ట్రాల నుండి 19 సీట్లకు జరిగిన ఎన్నికలలో బీజేపీకి 8 సీట్లు గెల్చుకొంది.

కాంగ్రెస్ 4 సెట్లను గెల్చుకోవడంతో ఆ పార్టీ బలం 41 సీట్లకు చేరుకొంది. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న పార్టీల బలం 27గా ఉంది. పదవికాలం ముగించుకున్న 61 మందిలో బిజెపికి చెందిన 15 మంది, కాంగ్రెస్ కు చెందిన 17 మంది ఉన్నారు.

మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇప్పుడు బీజేపీకి సభ్యునిగా రాజ్యసభలో ప్రవేశిస్తుండగా, ప్రతిపక్షంలో ప్రముఖ నాయకులు హెచ్ డి దేవెగౌడ, దిగ్విజయ్ సింగ్, మల్లిఖార్జున్  ఖర్గే, శిబూ సరిన్ వంటివారు వస్తున్నారు. ప్రతిపక్షంలో టిఎంసి నాలుగు, 2ఎన్సీపీ  సీట్లను కాపాడుకోగా, ఆర్ జె డి 2, శివసేన ఒక సీట్ గెలుచుకున్నాయి.

గుజరాత్, మధ్య ప్రదేశ్ లలో బిజెపి తన బలాన్ని పెంచుకోగలిగింది. సింథియా సహకారంతో గత మార్చ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన బీజేపీకి ఇప్పుడు 2 సీట్లను గెల్చుకొంది. రాజ్యసభ ఎన్నికల ప్రకటన తర్వాత కాంగ్రెస్ కు ఎనిమిది మంది ఎమ్యెల్యేలు రాజీనామా చేయడంతో రెండు సీట్లు గెల్చుకొనే బలం గల బీజేపీ మూడు సీట్లు గెల్చుకోగలిగింది.

మణిపూర్ లో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న తొమ్మిది మంది ఎమ్యెల్యేలు తమకు మద్దతు ఇస్తున్నట్లు ఎన్నికల ముందు రోజు కాంగ్రెస్ ప్రకటించినా, బిజెపి రాష్ట్రంలోని ఒక రాజ్యసభ సీట్ ను గెల్చుకోగలిగింది.  ఏపీలో వైసీపీకి చెందిన నలుగురు కూడా ఎన్నికయ్యారు.