గోహత్య నిషేధాన్ని కఠినంగా అమలు జరపడానికి ఉ త్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇకపై గోహత్యకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ 5 లక్షల జరిమానా కూడా విధిస్తారు.
గోవును గాయపరిస్తే ఏడేళ్ల జైలు, రూ 3 లక్షల జరిమానా విధిస్తారు. గో హత్య నిషేధ చట్టాన్ని (1955) సవరిస్తూ తీసుకు రాదలచిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
గో వధ నిషేధ చట్టం-1955ను 1958, 1961, 1979, 2002లలో సవరించారు. 1964, 1979లో నిబంధనలు సవరించారు. తాజా ఆర్డినెన్స్ ప్రకారం గోవులను అక్రమంగా తరలిస్తే సదరు వాహన యజమానితో పాటు డ్రైవర్, ఆపరేటర్ బాధ్యులవుతారు. అక్రమంగా తరలించాలనుకున్న గోవుల బాగోగులకు పరిహారాన్ని యజమాని నుంచే వసూలు చేస్తారు.
గో సంరక్షణలో భాగంగా గోవులకు వేళకు ఆహారం, నీరు అందించకపోయినా నేరంగా భావిస్తారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఆధారభూతమైన వ్యవసాయ రంగంలో గోవులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం తెలిపింది. గోవులను సంరక్షించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొంది.
అయోధ్య రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన రోజే గోహత్య నిషేధ చట్టం తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!