త్వరలో దేశమంతా ఒకే రోడ్‌‌ పన్ను 

వ్యక్తిగత వాహనాలకు త్వరలో దేశమంతా ఒకే రోడ్‌‌ పన్ను ‌‌ అమల్లోకి రాబోతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం  కసరత్తు చేస్తోంది. రహదారుల పన్ను రాష్ట్ర జాబితాలో ఉండడంతో  ప్రస్తుతం ఒకొక్క రాష్ట్రంలో  ఒక్కోలా ఉంది. కర్నాటకలో అత్యధికంగా, త్రిపురలో అతి తక్కువగా పన్ను విధిస్తున్నారు. 

‘ఒక దేశం–-ఒకే రోడ్డు పన్ను’ విధానం కింద విధించాల్సిన పన్నులపై 2018లో నియమించిన మంత్రుల కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాహనాల ఇన్వాయిస్ ధర ఆధారంగా పన్ను వసూలు చేయాలని సూచించారు. వాహనాల ధర ‌‌ రూ.10 లక్షల్లోపుంటే 8 శాతం పన్ను, రూ. 10–-20 లక్షల మధ్య ఉంటే 10 శాతం, రూ.20 లక్షలకు మించితే 12 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించింది.

తెలంగాణలో  రూ.10 లక్షల లోపున్న వెహికల్స్‌‌కు 9 శాతం, రూ.10 లక్షలు ఆ పైన ఉంటే 14 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ కొత్త పన్ను ‌‌ విధానం అమలైతే తెలంగాణలో పన్నులభారం అవకాశం ఉంటుంది.  వాహనాలు ‌ కొనేటప్పుడు రోడ్‌‌ పన్ను ‌‌ తప్పనిసరిగా కట్టాలి. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా స్లాబులున్నాయి.

కర్నాటకలో అత్యధికంగా 13 నుంచి 18 శాతం ఉండగా త్రిపురలో అత్యల్పంగా రూ.410 నుంచి రూ.825 దాకా ఉంది. దీంతో కొందరు తక్కువ పన్ను ‌‌ ఉన్న రాష్ట్రాల్లో వాహనాలు ‌‌ కొంటున్నారు. ఫలితంగా ఎక్కువ పన్నున్న రాష్ట్రాల్లో వాహనాల‌‌ అమ్మకాలపై ప్రభావం పడుతోంది.

మరోవంక కాలుష్యం తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ‌‌ పెంచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 15 ఏళ్ల పైబడిన వాహనాల ‌‌ రెన్యువల్ చార్జీలు భారీగా పెరిగే అవకాశం  ఉంది. 

ప్యాసింజర్ కార్లకు రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 10,000కు పెంచే అవకాశం ‌‌ ఉంది. ట్యాక్సీలకు రూ. 1,000 నుంచి రూ. 15,000కు పెంచాలని ప్రతిపట్టిస్తున్నారు. దీనిపై త్వరలోనే ముసాయిదా నోటిఫికేషన్‌‌ రానుంది.