16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేది నుండి జరిపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19న రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరగాల్సిఉండంతో అంతకు రెండు, మూడు రోజుల ముందు అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 

గత మార్చ్ లో కరోనా కారణంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడటం, ఆర్డినెన్సు ద్వారా మూడు నెలలకు మాత్రమే వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించడంతో ఈ నెలాఖరు లోగా వార్షిక బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం పొందవలసి ఉంది. అందుచేత ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరపడం అనివార్యంగా కనిపిస్తున్నది. 

19న రాజ్యసభ ఎన్నికలు జరిగిన అనంతరం 20, 21 తేదీల్లో సెలవుల తరువాత మళ్లీ సోమవారం నురచి సమావేశాలు కొనసాగిరచాలని భావిస్తున్నట్లు తెలిసింది. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ హరిచందన్ ప్రసంగించనున్నారు. 18వ తేదీన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారని చెబుతున్నారు. 

సచివాలయ భద్రతా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ ఖరారు కావడరతో సమావేశాల నిర్వహణకు సంబంధించిన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉరటురదని అధికారులు చెబుతున్నారు. అయితే, ఉభయ సభల సంయుక్త సమావేశంతో పాటు, శాసనసభలో ఉన్న 175 మందికి భౌతిక దూరం పాటిస్తూ సీట్ల ఏర్పాటు చేయడం అధికారులకు సవాల్‌గా మారనుంది.