తమిళ్ హీరో సూర్య తండ్రిపై టిటిడి కేసు 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై దుష్ప్రచారం చేశారనే అభియోగాలతో తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారనే టీటీడీ ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ రాశారు. నిందితుల్లో తమిళ హీరో సూర్య తండ్రి శివకుమార్‌ కూడా ఉన్నారు. 
 
శివకుమార్‌ ఒక వీడియోలో టీటీడీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారంచేశారని, ఆయనపై చర్య మెయిల్‌ ద్వారా టీటీడీకి ఫిర్యాదుచేశారు. అయితే, తలు తీసుకోవాలని తమిళ్‌మయ్యన్‌ అనే వ్యక్తి ఇ-నపై వచ్చిన ఆరోపణలను శివకుమార్‌ ఖండించారు. 
 
భక్తులకు శ్రీవారి దర్శనం జూన్‌ 30 వరకు నిలిపివేస్తారంటూ మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్‌, ముంగర శివరాజు, Way2news short newల్లో తప్పుడు ప్రచారం చేశారు. టీటీడీ ఫిర్యాదు మేరకు యాప్  నిర్వాహకులు,  తిరుపతివార్త, గోదావరి న్యూస్‌వాట్సాప్‌ గ్రూపులపై పోలీసులు కేసు పెట్టారు.
ఇలా ఉండగా,  దూరప్రాంతాల నుంచి భక్తులెవరూ తొందరపడి తిరుమలకు రావొద్దని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. ముందే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌చేసుకొని వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వెల్లడించారు. అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌, వాహనాల తనిఖీల అనంతరం దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారని చెప్పారు. 
 
కాగా, కేంద్ర ప్రభుత్వ నిబందనలను అనుసరించి 10 సంవత్సరాలలోపు చిన్నారులను, 65 సంవత్సరాలు పైబడిన వృద్దులను ఎట్టి పరిస్థితుల్లో కొండపైకి అనుమతించేది స్పష్టం చేశారు.