కరేలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చకియా ప్రాంతంలో ఉన్న అతడి ఇంటిని బుల్డోజర్‌తో బుధవారం కూల్చివేశారు. రూ. 2.5 కోట్ల విలువైన ఈ భవనం అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ ఇటీవల నోటీసులు జారీ చేశారు.కాగా, ఉమేష్ పాల్‌పై కాల్పులు జరిపిన వ్యక్తులను కారులో తరలించిన అర్బాజ్‌ను పోలీసులు సోమవారం ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. అలాగే ఈ కేసులో మరో నిందితుడైన సదాఖత్ ఖాన్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. సదాఖత్ ఖాన్‌కు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ అనుచరుడి బిల్డింగ్‌ను బుల్డోజర్‌తో కూల్చివేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇదిలావుండగా, ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇంటిని చట్టవిరుద్ధంగా నిర్మించినట్లు తెలుస్తోంది. దీని కూల్చివేతకు గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పీడీఏ వైస్ చైర్మన్ అరవింద్ కుమార్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తెలిపారు. అందుకే దీనిని కూల్చేస్తున్నామన్నారు. చట్ట ప్రకారం అవసరమైన అన్ని పద్ధతులను పాటించినట్లు తెలిపారు. ఈ ఇంటి యజమానికి ముందుగానే నోటీసు ఇచ్చామని చెప్పారు.

More Stories
బెంగాల్ లో 19 సీనియర్ అధికారులపై ఇసి వేటు
వారణాసిలో గంగా నదిపై ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్
పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం.. సుప్రీం సూచన