విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
2022 లో ఈ సంఖ్య 2,25,620కు పెరిగినట్లు చెప్పారు. 2011 నుంచి భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 16,63,440గా పేర్కొన్నారు. మరోవైపు గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే భారతీయులు పౌరసత్వం పొందిన 135 దేశాల జాబితాను కూడా ఆయన వెల్లడించారు.

More Stories
ప్రభుత్వ విధానాలతోనే పశ్చిమాసియా సంక్షోభం నుండి గట్టెక్కాం
అయోధ్యలో విరాళాల చోరీపై మోహన్ భగవత్ `రామ్-రామ్’
బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా