ఢిల్లీ విద్యార్థికి ఐఎస్ఐఎస్‌తో లింకులు?.. ఎన్ఐఏ అరెస్ట్

గ్లోబల్ ఉగ్రవాద సంస్థ ఐసిస్  కోసం నిధుల సేకరిస్తున్నాడనే కారణంగా ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతున్న మోసిన్ అహ్మద్ అనే బిహార్ యువకుడిని ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. నగరంలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మోసిన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపింది.
 ఐఎస్ఐఎస్‌తో ఆన్‌లైన్‌ వేదికగా  సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ఉగ్రవాదం పట్ల ప్రేరేపితమై నిధులు సేకరిస్తున్నాడని ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు  వెల్లడించారు. వేర్వేరు దేశాల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులను సిరియాకి చేరవేస్తున్నాడని ఎన్ఐఏ వివరించింది. అయితే ఈ ఆరోపణలను మోసిన్ కుటుంబం తోసిపుచ్చింది. కోర్టులో సవాలు చేయబోతున్నట్టు తెలిపింది.
మోసిన్‌కి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో పనిచేస్తున్నాడు.   కాగా ఢిల్లీలోని బత్లా ఏరియాలో నివాసముంటున్న మోసిన్‌ను ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. ఐఎస్ఐఎస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలు నడుపుతున్నాడని, క్షేత్రస్థాయి కార్యకలాపాలకు కూడా పాల్పడ్డాడని పేర్కొంది. మోసిన్ అహ్మద్‌ను ఐఎస్ఐఎస్ క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడని, సానుభూతిపరుల నుంచి ఇటు భారత్‌తోపాటు విదేశాల నుంచి నిధులు సేకరించాడని పేర్కొంది.
 
జూన్ 25న ఏజెన్సీ నమోదు చేసిన “ఐఎస్ఐఎస్ ఆన్‌లైన్, ఆన్-గ్రౌండ్ కార్యకలాపాలకు” సంబంధించిన కేసులో శనివారం అతని ప్రాంగణంలో, తర చోట్ల సోదాలు నిర్వహించిన తర్వాత అహ్మద్‌ను అరెస్టు చేశారు. గత ఆదివారం, ఏజెన్సీ ఆరు రాష్ట్రాల్లోని 13 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
సందర్భంగా 6 రాష్ట్రాల్లోని 13 అనుమానితుల ప్రాంగణాల్లో ఎన్ఐఎ  సోదాలు నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, రైసెన్ జిల్లాలు; గుజరాత్‌లోని భరూచ్, సూరత్, నవ్సారి, అహ్మదాబాద్ జిల్లాలు; బీహార్‌లోని అరారియా జిల్లా; కర్ణాటకలోని భత్కల్,తుంకూర్  సిటీ జిల్లాలు; మహారాష్ట్రలోని కొల్హాపూర్, నాందేడ్ జిల్లాలు; ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్ జిల్లాలలో సోదాలు జరిపినట్లు ఆ సందర్భంగా ఎన్ఐఎ ఓ  ప్రకటనలో తెలిపింది.
 నిర్వహించిన సోదాలల్లో “నిందిత పత్రాలు/మెటీరియల్” స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో మరో నలుగురితో పాటు అరెస్టయిన సాథిక్ బట్చా అలియాస్ సాథిక్‌ను అరెస్టు చేసిన కేసులో అదే రోజు, కేరళలోని తిరువనంతపురం జిల్లాలో కూడా సోదాలు నిర్వహించింది. ఎన్ఐఎ  ప్రకారం, నిందితులు సాధారణ ప్రజలను, పోలీసు అధికారులను బెదిరించడానికి కుట్ర పన్నారు.
ఫిబ్రవరి 21, 2022 న వారి స్కార్పియో కారును తనిఖీ చేస్తున్నప్పుడు వారిని అడ్డగించిన పోలీసు సిబ్బందిని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. “ఆరోపించిన వ్యక్తులు భారతదేశంలోని కొంత భాగాన్ని విడదీయడం కోసం ద్వేషాన్ని రెచ్చగొట్టడంలో కూడా పాల్గొన్నారు.   “ఖిలాఫత్ పార్టీ ఆఫ్ ఇండియా”, “ఖిలాఫత్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా”, “మేధావి విద్యార్థులు” వంటి సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా భారత దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించాలని భావించారు.
 నిషేధించిన తీవ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్/దేశ్, అల్ ఖైదాలతో తమను తాము అనుబంధం చేసుకుంటున్నారని ఎన్ఐఎ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కేసును గతంలో తమిళనాడు పోలీసులు నమోదు చేయగా,  ఈ ఏడాది ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.