* హైదరాబాద్ నుంచి గంటలో విజయవాడకు, రెండు గంటల్లో చెన్నై, ముంబైలకు
హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ లో “విక్షత్ భారత్-2047లో సాంకేతికత పాత్ర” అనే అంశంపై ప్రసంగిస్తూ, వచ్చే ఏడాది అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలును ప్రారంభించనున్నట్లు వైష్ణవ్ ప్రకటించారు. ఈ విప్లవాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయాలు ఊహించని విధంగా తగ్గిపోతాయని తెలిపారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు ఈ రైళ్లతో ప్రయాణ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి. బుల్లెట్ రైలు ఎక్కితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం ఒక గంట పది నిమిషాల్లోనే చేరుకోవచ్చని రైల్వే మంత్రి వివరించారు. అలాగే వ్యాపార రాజధాని ముంబైకి రెండు గంటల ఇరవై నిమిషాలు, చెన్నై నగరానికి కేవలం రెండు గంటల్లోనే దూసుకుపోవచ్చని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ దేశ రవాణా రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టుల క్రెడిట్ కోసం కొందరు పాకులాడుతున్నారంటూ విపక్షాలపై మంత్రి మండిపడ్డారు. దీని పూర్తి క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందని తేల్చి చెప్పారు. గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్లో కేవలం రూ.800 కోట్లు మాత్రమే ఇస్తే, తమ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే ఏకంగా రూ.5000 కోట్ల రైల్వే నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ నిధుల వరద వల్లే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని స్పష్టంచేశారు.
కుత్రిమ మేధ (ఏఐ) పెరుగుతున్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఏఐ అనేక సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతోందని, ఎలక్ట్రానిక్స్ రంగంలో విస్తారమైన అవకాశాలను అందిస్తోందని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో కేంద్రం నాలుగు ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్లను ఆమోదించిందని, మంజూరైన మూడు సెమీకండక్టర్ కేంద్రాలలో ఒకదానిలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని ఆయన తెలిపారు.

More Stories
మెటా ఇండియాపై కేసు.. రాజకీయ వత్తిడితో హైదరాబాద్ డీసీపీ బదిలీ!
మారుమూల గ్రామాలకు పి ఎం జి ఎస్ వై రహదారులు
తెలంగాణాలో 40 లక్షల ఓట్లు తొలగించే అవకాశం