టీటీడీ పాలకమండలి సమావేశంలో బ్రహ్మోత్సవాల వివరాలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పాలకమండలి సభ్యులు కలిసి విడుదల చేశారు. రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అదే కార్యక్రమంలో 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.
భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. బ్రహ్
ఈ ఏడాది గరుడసేవకు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం మంది భక్తులు అదనంగా వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గరుడసేవ రోజున గతేడాది 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంటూ ఇది గతేడాదితో పోలిస్తే 52 శాతం అదనం అని చెప్పారు.
భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో లైప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొంటూ ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిపాలనలో టీటీడీ ప్రవేశ పెట్టిందని చెప్పారు. ఈ పథకం ద్వారా మరణించిన భక్తుని కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.

More Stories
యూట్యూబర్ నందనని నాలుగు గంటల విచారణ
లండన్ జాబ్స్ పేరిట ఘరానా మోసం.. యూట్యూబర్ నందన అరెస్ట్
దసరాకు విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ