తన వెంట వచ్చిన నలుగురు. లాయర్ల సమక్షంలో ఆమెను సీఐ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు నాలుగు గంటల పాటు విచారణ చేశారు. మొత్తం 30 నుంచి 40 ప్రశ్నల వరకు పోలీసులు అడిగినట్లు తెలిసింది. ఆమె కొన్నింటికి మాత్రమే సమాధానాలు చెప్పినట్లు సమాచారం. లండన్ కేంద్రంగా నడుస్తున్న ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కన్సల్టెన్సీకి సంబంధించిన వ్యవహారాలను తన భర్త మధుకర్, అకౌంటెంట్ చూసుకుంటారని.. తాను అందులో జోక్యం చేసుకోనని నందన చెప్పినట్లు తెలుస్తోంది.
విచారణ అనంతరం సీఐ మాట్లాడుతూ తాను ఎవరిని మోసం చేయలేదని, ఏ తప్పు చేయలేదని, ఎవ్వరి వద్ద డబ్బులు వసూలు చేయలేదని, మొత్తం తన భర్త మధుకర్ డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాలు చూస్తారని చెప్పారని తెలిపారు. సమయానికి వెళ్లకపోవడం వల్లే వీసాలకు తమను సంప్రదించిన వారి వీసాలు రద్దయ్యాయి తప్ప మా తప్పేం లేదని, వీసాలు ఎందుకు రద్దయ్యాయో వచ్చిన ఎస్ఎంఎస్ లు చూపించినట్లు ఆయన తెలిపారు.
కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆమె వివరించిందని, మరికొన్ని ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేదని చెప్పారు. ఆమెను. ఆమె భర్త మధుకర్ ను, మామ మోహన్ రావు ఈ నెల 16న మరో మారు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు. తాను లండన్ వెళితే తప్ప తన భర్త మధుకర్ ఇండియాకు వచ్చే అవకాశాలు లేవని, తమ పిల్లలను స్కూల్ కు పంపాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు లండన్‌లో ఉండాలని, ఇద్దరం ఒకే సారి విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని ఆమె చెప్పినట్లు సీఐ తెలిపారు.
తొలుత తమపై ఉన్న లుక్ అవుట్ నోటీసులు ఎత్తివేస్తే విచారణకు సహకరిస్తామని రమానందన ముందస్తుగా పోలీస్ ఉన్నతాధికారులు, ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యంకు మెయిల్ పెట్టారు. అయితే లుక్ అవుట్ నోటీసులు ఎత్తి వేసేందుకు పోలీసులు అంగీకరించలేదు. అయినా సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమై, నోటీసులు అందుకొని మంగళవారం విచారణకు హాజరయ్యారు.

More Stories
ఐదు ఇరాన్ చమురు నౌకలను ధ్వంసం చేసిన అమెరికా
భారత్ 7.8% జీడీపీ వృద్ధి ప్రపంచానికి కొత్త ఆశ
మాజీ సీఎం విజయన్, కుమార్తె, అల్లుడిపై అవినీతి కేసు