జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు

జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు

జపాన్​ ఓపెన్​ టైటిల్​ గెలుచుకున్న తొలి భారత మహిళా షట్లర్​గా చరిత్ర 

భారత షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది.  భారత స్టార్​ షట్లర్ పీవీ సింధు జపాన్​ ఓపెన్​ సూపర్​ 750 బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​లో విజేతగా నిలిచింది. జపాన్​కు చెందిన వరల్డ్​ నంబర్​ 3 అకానె యమగూచిని 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో ఓడించి టైటిల్​ను కేవసం చేసుకుంది. ఈ విజయంతో జపాన్​ ఓపెన్​ టైటిల్​ గెలుచుకున్న తొలి భారత మహిళా షట్లర్​గా సింధు చరిత్ర సృష్టించింది.

మహిళల సింగిల్స్ ఫైనల్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ యమగుచిని వరుసగా గేమ్‌ల్లో ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది. జపాన్ ఓపెన్‌లో ఆరేళ్లలో తన అతిపెద్ద టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, తన అచంచలమైన ఆత్మవిశ్వాసం చివరికి ఫలించిందని భావోద్వేగానికి లోనైన పీవీ సింధు పేర్కొన్నారు. 

వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో ఆరో పతకం కోసం పోటీపడనున్న ఆమె, ఇదే వేగాన్ని, నిబ్బరాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. దాదాపు రెండేళ్ల టైటిల్ కరువును తీర్చుకున్న తర్వాత, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు ఇలా అన్నారు: “నిజానికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి, ఎందుకంటే గెలవడం నాకు చాలా ముఖ్యం. నేను నిజంగా చాలా ఏకాగ్రతతో నాపై నేను తీవ్రంగా కృషి చేశాను.”

మహిళల సింగిల్స్ మ్యాచ్ ప్రారంభం నుంచే పీవీ సింధు దూకుడుగా ఆడింది. క్రాస్‌కోర్ట్ డ్రాప్స్, శక్తివంతమైన స్మాష్‌తో యమగుచిపై ఒత్తిడి పెంచింది. తొలి గేమ్‌లో చివరి వరకు హోరాహోరీ పోరు సాగినా.. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధించిన సింధు 21-17తో గేమ్‌ను తన ఖాతాలో వేసింది. మొదటి గేమ్‌ను గెలిచిన ఊపుతో రెండో గేమ్‌లోనూ సింధు మరింత దూకుడు పెంచింది. యమగుచి నెట్ గేమ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ.. 21-17తో రెండో గేమ్‌ను ముగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఈ అద్భుత విజయంతో సింధు గత 19 నెలలుగా ఎదురుచూస్తున్న టైటిల్​ నిరీక్షణకు తెరపడింది. గేమ్ ప్రారంభంలో జపనీస్​ క్రీడాకారిణి కంటే వెనుకబడిన సింధు, ఆ తర్వాత పుంజుకొని, వరుస గేముల్లో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విధంగా మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన యమగూచిపై విజయం సాధించి, సింధు తనంటో మరోసారి నిరూపించుకుంది. సింధు 2019లో ప్రపంచ ఛాంపియన్​షిప్​ టైటిల్ గెలుచుకుంది. 2024 డిసెంబర్​లో సొంత గడ్డపై సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్​ టైటిల్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత సింధు సాధించిన అతిపెద్ద టైటిల్ ఇదే కావడం గమనార్హం.

వాస్తవానికి సింధు చివరిసారిగా 2020 థాయ్​లాండ్​ ఓపెన్​లో యమగూచిపై గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఏ మ్యాచ్​లోనూ ఆమెపై సింధు గెలవలేదు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో మలేషియా ఓపెన్​లో వీరిద్దరూ తలపడ్డారు. అయినప్పటికీ మొదటి గేమ్ తర్వాత యమగూచి గాయం కారణంగా తప్పుకుంది. మరోవైపు సింధు గత 19 నెలల్లో ఒక్క టైటిల్​ కూడా గెలవలేదు. ఈ తరుణంలోనే జపాన్​ ఓపెన్​లో ఆమె యమగూచితో తలపడింది.ఆరోసారి జపాన్ ఓపెన్​​ ఫైనల్​కు చేరిన యమగూచిని, ఆమె సొంత దేశంలో సింధు ఎదుర్కొంది. మ్యాచ్ ప్రారంభం నుంచి మ్యాచ్​పై పట్టు సంపాదించింది. నెట్​ వద్ద అద్భుత నియంత్రణ ప్రదర్శించింది. కేవలం బలాన్ని మాత్రమే నమ్ముకోకుండా, వ్యూహాత్మకంగా దాడులు చేసింది. యమగూచి పుంజుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ సింధు ధీటుగా ప్రతిస్పందించింది. నెట్​ గేమ్​తోపాటు, పవర్​ఫుల్​ స్మాష్​లతో, క్రాస్​-కోర్ట్​, బాడీ స్మాష్​లతో విరుచుకుపడింది.