పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న దేశంలోని 17 అతి పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల పరంగా చూస్తే 13వ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ శుక్రవారం విడుదల చేసిన ‘ఇన్వె్‌స్టమెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, వనరులు, నిబంధనల సడలింపు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పటిష్ఠత, పర్యావరణం తదితర అంశాలు ఆధారంగా రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులను కేటాయించింది. దీని ప్రకారం, తెలంగాణ 47.3 స్కోరు సాధించింది.
రాష్ట్ర తలసరి జీఎ్‌సడీపీ రూ.2,17,801. సులభతరమైన నిబంధనల విషయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. పటిష్ఠమైన సంస్థాగత యంత్రాంగాలు ఉన్నందువల్లే తెలంగాణలో అనుమతులు వేగంగా లభిస్తున్నాయని ఈ నివేదిక ప్రశంసించింది. వ్యాపార అనుకూల వాతావరణం అంశంలో మొత్తం 20లో తెలంగాణ 7.8 స్కోరును దక్కించుకుంది.
సాంకేతిక పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ సేవలు, విన్నూత యజమాన్య పద్ధతుల విషయంలో రాష్ట్రం క్రియాశీలక కేంద్రంగా మారిందని నివేదిక పేర్కొంది. మానవ వనరుల లభ్యతతో పాటు సహజ వనరుల లభ్యత కూడా తెలంగాణలో బలంగా ఉందని, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పెట్టుబడుల పంపిణీ విషయంలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉన్నాయని తెలిపింది.
లాజిస్టిక్ కారిడార్లు, భౌతిక నిల్వలు, డిజిటల్ నెట్‌వర్క్ విషయంలో మాత్రం తెలంగాణ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుందని వివరించింది. కిందిస్థాయి పాలన, అధికారులు సమస్యలను పరిష్కరించే విషయంలో తెలంగాణ వెనుకంజలో ఉందని.. ఈ అంశంలో మెరుగుపడాల్సి ఉందని తెలిపింది. ఆర్థిక క్రమశిక్షణ స్థిరంగా ఉన్నప్పటికీ మొత్తంగా అప్పులు, స్థూల ద్రవ్యలోటుపై పర్యవేక్షణ అవసరమని, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ అంశాల్లోనూ చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతి ఆయోగ్ నివేదిక అభిప్రాయపడింది.
నీతి ఆయోగ్ మొదటిసారిగా తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం గుజరాత్ భారతదేశంలో అత్యంత పెట్టుబడి-స్నేహపూర్వక రాష్ట్రంగా అవతరించింది. దాని తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ఈ సూచిక ర్యాంకింగ్‌లు, రాష్ట్రాలు ఒకదాని ఉత్తమ పద్ధతుల నుండి మరొకటి నేర్చుకుంటూ ప్రైవేట్ పెట్టుబడుల కోసం పోటీపడేలా ప్రోత్సహిస్తాయని నీతి ఆయోగ్ ఆశిస్తోంది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్‌తో సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ‘ఎమర్జింగ్ పెర్ఫార్మర్స్’గా వర్గీకరించగా, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌తో సహా మరో ఎనిమిది ‘ఆస్పైరింగ్ స్టేట్స్’ కేటగిరీలో ఉంచారు.

More Stories
హార్ముజ్ జలసంధి కాకుండా ఇంధన సరఫరాకు సరికొత్త వ్యూహం!
నీట్-యూజీ 2026 లీక్..రూ.5 లక్షలకే 111 ప్రశ్నలు విక్రయం
రేపే పట్టాలెక్కనున్న తొట్టతొలి హైడ్రోజన్ రైలు