ముఖ్యంగా జాతీయ గీతం (జనగణమన)తో పాటు జాతీయ గేయం (వందేమాతరం) కూడా తప్పనిసరిగా పాడేలా నిబంధన తెస్తూ ‘జాతీయ గౌరవానికి అవమానాన్ని నిరోధించే చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్-1971)కు సవరణ బిల్లును ప్రతిపాదించనుంది. దీనితో జనగణమన గీతానికి ఉన్న రక్షణ ఇకపై వందేమాతరం గేయానికీ వర్తిస్తుంది.
జాతీయ గీతం, గేయంలో దేనిని అవమానించేలా వ్యవహరించినా మూడేళ్ల వరకు శిక్ష, జరిమానాలు విధిస్తారు. కాగా, అన్ని అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని ఆరు పంక్తులను చదవాలని కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ పాడాల్సి వస్తే జాతీయ గేయానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. కానీ అవి మార్గదర్శక సూత్రాలేనని, తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో చట్టరూపం కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
విదేశీ నిధులు స్వీకరించే ఎన్జీవోల రిజిస్ట్రేషన్ రద్దయినా, గడువు తర్వాత పొడిగింపు జరగకపోయినా సదరు నిధులతో నిర్మించిన ఆస్తులను స్వాధీనం చేసేందుకు ‘విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు’ను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. న్యాయస్థానాలు తేల్చకముందే ఆస్తులను కేంద్ర సంస్థకు బదిలీ చేసేందుకు, కాలపరిమితి పూర్తయిన ఎన్జీవోలు ఆటోమేటిగ్గా రద్దయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
యూజీసీ, ఏఐసీటీఈ ఎన్‌సీటీఈ వంటి విద్యారంగ నియంత్రణ సంస్థలను వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ పేరిట ఒకే సంస్థ పరిఽధిలోకి తీసుకువచ్చేందుకు వీలు కల్పించే బిల్లునూ ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించనున్నారు.

More Stories
దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఐదుగురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులు అరెస్టు
ఇస్రోలో కలకలం రేపుతున్న 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా