కోర్టు వైఖరిని గమనించిన మహువా మొయిత్రా తరఫు లాయర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు పరిగణిస్తూ కోర్టు కొట్టివేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహువా మెయిత్రా, అభిషేక్ బెనర్జీ సహా పలవురు టీఎంసీ ఎంపీలపై గుడ్ల దాడులు జరుగుతున్నాయి.
నాడియా జిల్లాలో నమోదైన కేసులో పోలీసుల బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పించాలని, ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ కృష్ణనగర్ ఎంపీ మహువా మొయిత్రా కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అక్టోబర్ 5 వరకు రక్షణ కల్పిస్తూ జులై 21న మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. విచారణకు సహకరించాలని, విచారణాధికారి ఎదుట హాజరు కావాలని జస్టిస్ సౌగత భట్టాచార్య ఆదేశించారు.
కోర్టు విధించిన షరతులకు ఆమె కట్టుబడి, విచారణకు సహకరించిన పక్షంలో అక్టోబర్ 5 వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణకు అక్టోబరు 1కి వాయిదా వేసింది. కాగా, జులై 1న తన నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో ఓ దాబాలో మహువా మెయిత్రా సమావేశం నిర్వహించిన సమయంలో కొందరు ‘దొంగ, దొంగ’ అనే నినాదాలు చేస్తూ కోడి గుడ్లు, వంకాయలతో ఆమెపై దాడికి తెగబడ్డారు.

More Stories
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ప్రతిపాదనలు పునఃపరిశీలించండి
30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. అఫ్గాన్‌పై సిరీస్ క్లీన్ స్వీప్
టిఎంసి పేరు, గుర్తు స్తంభింప చేసిన ఎన్నికల సంఘం